Chandini Chaudhary: కలర్ ఫోటో హీరోయిన్ కు వేధింపులు

చాందిని చౌదరి.. కలర్ ఫోటో సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది హీరోయిన్ చాందిని చౌదరి. మొదట లఘు చిత్రాలతో తన నట ప్రస్థానం మొదలుపెట్టిన చాందిని ఆ తర్వాత కేటుగాడు సినిమాలో అవకాశం దక్కించుకొని టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. ఇక కలర్ ఫోటో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన చాందిని చౌదరి ఈ మూవీతో తన నటన పరంగా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీకి జాతీయ స్థాయిలో అవార్డులు రావడంతో కలర్ ఫోటో హీరోయిన్ గా చాందిని చౌదరికి మంచి క్రేజ్ వచ్చింది.

ఇటీవల సమ్మతమే అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ చిత్రంలో చాందిని నటించింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ తెలుగు అమ్మాయి.. తాజాగా నేటిజెన్లను అప్రమత్తం చేస్తూ ఓ పోస్ట్ చేసింది.

“నాతోపాటు నా సహనటీనటులకు సంబంధించిన పేర్లు, ఫోటోలతో గత కొన్ని నెలల నుండి అంతర్జాతీయ నెంబర్స్ ఉపయోగించి కొంతమంది వ్యక్తులు స్కామ్ కి పాల్పడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం కోసం వాట్సాప్ లో నా పేరు వాడుకుంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు. మీ వివరాలను వాళ్లతో పంచుకోకండి” అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో స్క్రీన్ షాట్లను షేర్ చేసింది చాందిని చౌదరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు