Chandini Chowdary: ఆ హేళనే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది.. చాందిని చౌదరి కామెంట్స్..!

Chandini Chowdhary: కలర్ ఫోటో సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న తెలుగు అమ్మాయి చాందిని చౌదరి తాజాగా నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి.. ఇందులో అజయ్ ఘోష్ లీడ్ రోల్ లో నటించగా.. చాందిని చౌదరి ఫీమేల్ లీడ్ గా నటించింది.. శివ పాలుడుగు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 14వ తేదీన విడుదల కానుంది.. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో అట్టహాసంగా పూర్తి చేశారు. ఇక ఈవెంట్ కి అతిధులుగా బేబీ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సాయి రాజేష్ , యువ నిర్మాత ధీరజ్ లు విచ్చేశారు.. ఈవెంట్లో అజయ్ ఘోష్ తన స్పీచ్ తో అదరగొట్టేయగా.. అదే రేంజ్ లో హీరోయిన్ చాందిని కూడా తన అద్భుతమైన స్పీచ్ తో అందరినీ అలరించి తాను ఈ స్థాయికి రావడం వెనుక ఉన్న కష్టాలను చెప్పుకొచ్చింది..

మ్యూజిక్ షాప్ మూర్తి కథ ఇదే..

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పడ్డ అవమానాలను, హేళనలను చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా చాందిని చౌదరి మాట్లాడుతూ.. మనిషి అన్న తర్వాత కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి. వాటిలో కొన్ని చిన్నప్పుడే తెలుసుకుంటాము.. మరికొన్ని పెరుగుతూ నేర్చుకుంటాము.. అయితే కొన్ని మన రియాల్టీకి దగ్గరగా ఉంటాయి.. సాధించగలం అనుకుంటాము కానీ ఇట్టే దూరం అయిపోతాయి.. ఆ సమయంలో కొందరు ఎగతాళి చేస్తారు. ఎవరో ఒకరు ఇది నీకు అవసరమా అంటూ చెబుతారు.. అలాంటి బేస్ పాయింట్ మీదే చేసిన సినిమానే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి.. కొన్నింటిని కొందరు వయసు అయిపోతుంది.. సాధించలేరు అని అనుకుంటాం కదా.. ఈ సమయంలో ఇది డ్రాగ్ చేయలేకపోతే వేరే దానికి వెళ్లాలన్న ఆలోచన కూడా ఉంటుంది.. ఆ సమయంలో ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల కొన్నిచోట్ల కాంప్రమైజ్ కూడా అయిపోతాము. ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ సినిమాలో చాలా ఉన్నాయి.. ముఖ్యంగా కల కనడానికి వయసుతో సంబంధం లేదు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అంటూ చెప్పుకొచ్చింది చాందిని చౌదరి..

ఆ హేళన తర్వాతే ఈ స్థాయికి వచ్చా..

Chandini Chowdary: That prank brought me to this level.. Chandini Chowdary comments..!
Chandini Chowdary: That prank brought me to this level.. Chandini Chowdary comments..!

అయితే సరిగ్గా ఈ సినిమా తన జీవితానికి అర్థం పడుతుంది అంటూ చెప్పుకొచ్చింది. సరిగ్గా 10 సంవత్సరాలకి ముందు నువ్వు హీరోయిన్ ఏంటి అన్నారు.. కానీ మనం పెట్టుకున్న గోల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే తప్పకుండా రీచ్ అవుతాము.. చిన్న సినిమాలైనా కానీ నాకు చాలా పెద్దవి.. అవి ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం అంటే ఇంతకంటే సంతోషం ఏమంటుంది.. ముఖ్యంగా మ్యూజిక్ షాప్ మూర్తి లాంటి హృదయానికి దగ్గరయ్యే ఈ సినిమాలో భాగమైనందుకు నేను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను.. అంటూ తెలిపింది.

- Advertisement -

100 మందిలో ఒక్కరు చేసినా సక్సెస్ అయినట్టే..

అంతేకాదు చాందిని మాట్లాడుతూ.. వంద మందిలో ఒక్కరు ట్రై చేసిన మేము సక్సెస్ అయినట్టే.. ఈ సినిమా చూసి మూర్తి చేశాడు కదా అని ఆలోచిస్తే.. అప్పుడు మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము.. మంచి కాన్సెప్ట్.. సినిమా తప్పకుండా చూడండి అంటూ చాందిని చౌదరి చెప్పుకొచ్చింది.. ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి లేదా ఏ విభాగంలో అయినా సక్సెస్ అవ్వాలని వేసే అడుగులలో తప్పకుండా తప్పటడుగులు పడతాయి.. అలాంటి సమయంలో కచ్చితంగా హేళనలు అవమానాలు ఎదురవుతాయి. వాటిని అధిగమిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామంటూ నిరూపించింది చాందిని చౌదరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు