Chandini Chowdhury: తెలుగు హిరోయిన్ వి ఒకేరోజు రెండు సినిమాలు

Chandini Chowdhury: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కు అవకాశాలు రావు అంటూ కొంతమంది ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా టాలెంట్ ఉంటే ఏ ఫిలిమ్ ఇండస్ట్రీలోనైనా రాణించవచ్చు అని చాలామంది నిరూపించారు. మామూలుగా తెలుగు ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తారు. చాలామంది తమిళ్ హీరోల సినిమాలు కూడా ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇకపోతే ప్రస్తుతం చాలామంది తెలుగు హీరోయిన్స్ మిగతా ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తున్నారు.

Chandini Chowdary
షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి మను సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది చాందిని చౌదరి. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడిపోయింది. అయితే ఇప్పటివరకు చాందిని చౌదరి కెరియర్లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ సినిమా అయితే పడలేదు కానీ అవకాశాలు మాత్రం వరుసగా వస్తున్నాయి. రీసెంట్గా గామి అనే సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది.

ప్రస్తుతం చాందిని చౌదరి చేస్తున్న రెండు సినిమాలు జూన్ 14న బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అజయ్ ఘోస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మ్యూజిక్స్ షాప్ మూర్తి. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ట్రైలర్ కూడా బానే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాతో పాటు చాందిని చౌదరి నటిస్తున్న ఏవమ్ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకేరోజు ఒకే యాక్టరస్ సినిమాలు రెండేసి రావటం అనేది చాలా సార్లు జరిగింది. ఏదేమైనా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధిస్తే చాందిని చౌదరి కెరియర్ కు మరికొంత ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు