Yevam sansar details: సెన్సార్ పనులు ముగించుకున్న చాందినీ చౌదరి ” యేవమ్ ” మూవీ.. పోస్టర్ వైరల్..!

Yevam sansar details: యంగ్ బ్యూటీ చాందిని చౌదరి లీడ్ రోల్ లో నటించిన తాజా మూవీ యేవమ్. క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రకాష్ డైరెక్ట్ చేశాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇక ఈ మూవీ జూన్ 14న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ని కంప్లీట్ చేసుకుంది.

ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ను జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉన్నప్పటికీ.. క్రైమ్ సీన్స్, యాక్షన్ డోస్ కాస్త ఎక్కువ ఉన్న కారణంతో ఈ చిత్రంకు U/A సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. ఇక చాందిని చౌదరి పర్ఫామెన్స్ ఈ మూవీ కు మేజర్ అసెట్ కానుందని మూవీ యూనిట్ ఇప్పటికే తెలియజేసింది.

Chandni Choudhary's "Yevam" movie which has finished the censor work
Chandni Choudhary’s “Yevam” movie which has finished the censor work

ఇక ఈ చిత్రంలో చాందినీ చౌదరితో పాటు వశిష్ట సింహ, జై భరత్ రాజ్, అషు రెడ్డి, గోపరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీను నవదీప్ ప్రొడ్యూస్ చేస్తుండడంతో సినీ సర్కిల్స్ లోనూ ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. మరి రిలీజ్ అనంతరం ఈ చిత్రం ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు