Boyapati Sreenu meets CBN : ఏపీలో చంద్ర బాబు గెలుపు… బోయపాటికి భారీ బాధ్యత అప్పగింత

 

 

Boyapati Srinivas: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఫలితాలు వరుస గా రిలీజ్ అవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన… ఎన్నికల కౌంటింగ్… ఇంకా కొనసాగుతోంది. అయితే… ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అఖండ విజయాన్ని సాధించే దిశగా వెళుతోంది. ఇప్పటికే సొంతంగా తెలుగుదేశం పార్టీ 134 స్థానాలలో ముందంజలో ఉంది.

- Advertisement -

నాలుగు ఎమ్మెల్యే స్థానాల్లో విజయం కూడా సాధించింది. దీంతో నాలుగో సారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో… తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును కలిసేందుకు…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. ఈ సందర్భంగా చంద్రబాబు కు శుభాకాంక్షలు తెలిపిన బోయపాటి శ్రీనివాస్… ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు.

chandrababus-key-responsibilities-for-a-tollywood-director-boyapati-srinivas

అయితే… ఈనెల 9వ తేదీన… అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమ బాధ్యతలు బోయపాటి శ్రీనివాస్ కు చంద్రబాబు అప్పగించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే నారా చంద్రబాబు నాయుడును టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కలిసి నట్టు చెబుతున్నారు. కాగా ఏపీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు