Chandu Mondeti: జాతీయ అవార్డు తెచ్చిన ఉత్సాహం.. సీక్వెల్ పై ప్రకటన..!

Chandu Mondeti.. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి సంబంధించి.. 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితా విడుదల చేయగా, అందులో ఉత్తమ రీజినల్ చిత్రంగా తెలుగు నుండి కార్తికేయ -2 మాత్రమే జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ అవార్డు కోసం బలగం, సీతారామం, మేజర్ వంటి చిత్రాలు పోటీ పడగా.. గట్టి పోటీని ఎదుర్కొని కార్తికేయ -2 చిత్రం జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. అంతేకాదు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ చందూ మండేటికీ నేషనల్ అవార్డు లభించింది. అలాగే ఈ సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల అధినేతలైన టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కు ఈ అవార్డులు లభించడం గమనార్హం.

Chandu Mondeti: The excitement brought by the National Award.. Announcement on the sequel..!
Chandu Mondeti: The excitement brought by the National Award.. Announcement on the sequel..!

కార్తికేయ – 3 పై బిగ్ అప్డేట్..

ప్రస్తుతం ఈ సినిమాకు నేషనల్ అవార్డు లభించడంతో అటు డైరెక్టర్ ను ఇటు నిర్మాణ సంస్థలను పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా జాతీయ అవార్డు తీసుకొచ్చిన కొత్త ఉత్సాహం డైరెక్టర్ చందూ మండేటిలో స్పష్టంగా కనిపించిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే డైరెక్టర్ కార్తికేయ -3 పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం కార్తికేయ పార్ట్ -3 తప్పకుండా ఉంటుందంటూ తెలిపారు. అంతేకాదు రెండవ భాగాన్ని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా డైరెక్టర్ తెలియజేస్తూ సినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడేలా చేశారు.

తండేల్ తర్వాత షూటింగ్ ప్రారంభం..

ప్రస్తుతం డైరెక్టర్ చందు మొండేటి అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా తండేల్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రముఖ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే కార్తికేయ -3 సినిమా షూటింగ్ మొదలు పెడతామని డైరెక్టర్ స్పష్టం చేశారు.

- Advertisement -

సంతోషం వ్యక్తం చేసిన నిఖిల్..

ఇకపోతే ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడంతో హీరో నిఖిల్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ మేరకు ఒక వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. ఈ సినిమా విజయాన్ని అందుకోవడం అలాగే జాతీయ అవార్డుకి ఎంపిక అవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన కార్తికేయ -2 చిత్రం జాతీయ అవార్డుకు ఎంపిక అవ్వడం నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. అయితే ఈ సినిమా ఈ అవార్డుకు ఎంపిక అవ్వడానికి ముఖ్య కారణం చిత్ర బృందం. నిర్మాతలు, దర్శకుడు చందు, హీరోయిన్ అనుపమ, డి ఓ పి కార్తీక్ ఘట్టమనేని. అలాగే ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా ధన్యవాదాలు అంటూ తెలిపారు నిఖిల్.

అనుపమ్ కేర్ అద్భుత ప్రదర్శన..

ఇకపోతే ఈ సినిమాలోని నటీనటుల విషయానికొస్తే.. వారి పాత్రలకు 100% న్యాయం చేసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. కుమారస్వామి పాత్రలో నిఖిల్ ఒదిగిపోగా, ముగ్ధ పాత్రలో అనుపమా అదరగొట్టేసింది. అంతేకాదు ఈ సినిమాకే హైలైట్ అయిన డాక్టర్ ధన్వంతి వేద్పాఠక్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ చాలా అద్భుతంగా నటించారు.

ఎన్టీఆర్ ప్రశంసలు..

ఈ సినిమాకి జాతీయ అవార్డు లభించడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు కార్తికేయ -2 చిత్రం బెస్ట్ తెలుగు ఫిలిం గా జాతీయ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ చందు మొండేటి , యాక్టర్ నిఖిల్ కి నా శుభాభినందనలు అంటూ తెలియజేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు