HBD Jr NTR : ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ తరుణంలోనే.. సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ట్రెండింగ్ లోకి వచ్చాడు. అంతేకాదు… జూనియర్ ఎన్టీఆర్ కు చాలా మంది ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నేతలు, ఫ్యాన్స్ పుట్టిన రోజు శుభా కాంక్షలు చెబుతున్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన సినిమా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
జూనియర్ ఎన్టీఆర్ కు తన స్టైల్ పుట్టిన రోజు శుభా కాంక్షలు చెప్పారు రామ్ చరణ్. నా ప్రియమైన ఆప్తుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు హీరో రామ్ చరణ్. అంతేకాదు.. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి మరీ… తన స్నేహాన్ని చాటుకున్నాడు రామ్ చరణ్. ఇక ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. రామ్ చరణ్ చేసిన పోస్ట్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మెచ్చుకుంటున్నారు. దొస్తానా అంటే ఇదిరా అంటూ ఎన్టీఆర్, చరణ్ లపై కామెంట్స్ చేస్తున్నారు.
అయితే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబోలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఎన్టీఆర్ కు ఎక్కువగా లేదని అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఇంకా ఈ వివాదం కొనసాగుతోంది. అదే సమయంలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి మధ్య వివాదం జరిగిందని ఓ రూమర్ కూడా వచ్చింది. అందుకు గతేడాది ఎన్టీఆర్ బర్త్ డే ఇలా ప్రేమగా చరణ్ విశేష్ చెప్పలేదని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఇవాళ మాత్రం ఎన్టీఆర్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు చరణ్. ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి మరీ…పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు చరణ్. దీంతో వీరిద్దరూ మళ్లీ క్లోజ్ అయ్యారని అంటున్నారు.