Charmi Kaur: నైట్ పార్టీ ఇప్పించి ఏడు సినిమాలు కి సైన్ చేయించారు

Charmi Kaur: చార్మి అంటే తెలియని వాళ్ళు లేరని చెప్పొచ్చు. ఒకప్పుడు తెలుగు తమిళ్ హిందీ మలయాళంలో చాలా సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంది. భీమినేని శ్రీనివాస్ దర్శకత్వం వహించిన నీ తోడు కావలి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది చార్మి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత నీకే మనసిచ్చాను సినిమాతో మరోసారి రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమాలో మళ్లీ కనిపించింది. అయితే ఈ సినిమా కూడా ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. మొత్తానికి గౌరీ సినిమాతో ఛార్మి కి మంచి బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు.

ఇక ప్రస్తుతం చార్మి నటించడం మానేసి సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న అన్ని సినిమాలకు చార్మి నిర్మాతగా వ్యవహరిస్తుంది. అయితే చార్మి నిర్మించిన లేటెస్ట్ ఫిలిం డబుల్ ఇస్మార్ట్ శంకర్ (Double Ismart Shankar). రామ్ పోతినేని(Ram Pothineni)నటిస్తున్న ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్లో అందరూ బాబా అని పిలుచుకుని సంజయ్ (Sanjay Dutt) ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సంజయ్ దత్ ఈ సినిమాలో నటించే పాత్ర పేరు బిగ్ బుల్. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో దీని గురించి అనేక ఇంటర్వ్యూస్ నిర్వహిస్తుంది చిత్ర యూనిట్.

Ismart Shankar

- Advertisement -

ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అసలు సంజయ్ దత్ గారిని ఎలా ఒప్పించారు.? ఏడు సినిమాలకు సైన్ తనతో ఎలా చేయించారు అంటూ చార్మిని ఉద్దేశిస్తూ సంజయ్ దత్ ను అడిగాడు రామ్. దానికి సంజయ్ దత్ ఆన్సర్ చేస్తూ తను ముంబై వచ్చిన తర్వాత మేము పార్టీ చేసుకున్నాము అని చెప్పాడు. దీనికి కంటిన్యూగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) మాట్లాడుతూ కేవలం 10 నిమిషాలు మాత్రమే సినిమా గురించి మాట్లాడుకున్నాము. ఆ రాత్రంతా పార్టీ చేసుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సందర్భంలోనే ఏడు సినిమాలకు ఛార్మి సైన్ చేయించిందంటూ ఆ ఇంటర్వ్యూలో తెలిసింది. ఏదేమైనా కథలు వినకుండా అలా సైన్ చేయటం అనేది ఒక మిస్టేక్ అని కొంతమంది అభిప్రాయం.

ఇంక ఛార్మి కెరియర్లో మంచి హిట్ ఫిలిమ్స్ అంటే అనుకోకుండా ఒక రోజు,లక్ష్మి, పౌర్ణమి, రాఖీ , మాస్ సినిమాలు. అయితే వరుసగా హీరోయిన్ గా రాణిస్తున్న తరుణంలో చార్మి ప్రొడ్యూసర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాతో కో ప్రొడ్యూసర్ గా తన జర్నీ మొదలుపెట్టింది అక్కడితో సినిమాలకు నటించడంలో బ్రేక్ ఇచ్చింది చార్మి. అయితే చార్మి నిర్మించిన సినిమాలు అన్నీ కూడా ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు