Ram Charan – Brahmani: చెర్రీతో నారా బ్రాహ్మణి.. ఆల్బమ్ అదిరిందిగా..!

Ram Charan – Brahmani: గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ మనందరికీ సుపరిచితమే. త్రిబుల్ ఆర్ మూవీతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు చెర్రీ. ఇక ఇదిలా ఉంటే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి తెలిసిందే.

ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చెర్రీ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చరణ్ పక్కన నారా బ్రాహ్మణి కూర్చుని మాట్లాడుతున్న వీడియో ప్రెసెంట్ సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు నారా బ్రాహ్మణి.. సీఎం చంద్రబాబు నాయుడు కోడలు అన్న సంగతి తెలిసిందే.

ఇక తన మామగారి ప్రమాణ స్వీకారం చూసేందుకు బ్రాహ్మణి కూడా ఈ వేడుకకు విచ్చేసింది. ఈ క్రమంలోనే చరణ్ పక్కన కూర్చున్న బ్రాహ్మణి చెర్రీతో కొద్దిసేపు మాట్లాడింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఫ్రేమ్ అదుర్స్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు