Chetan Chandra : మహిళతో అనుచిత ప్రవర్తన…. చితకబాదిన జనం

Chetan Chandra : బెంగళూరులోని కగ్గలిపూర్ సమీపంలో కన్నడ నటుడు చేతన్ చంద్రపై ఆదివారం (మే 12) దాడి జరిగింది. నటుడిపై హత్యాయత్నం చేశారన్న అభియోగంపై కిరణ్, హరీష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును కగ్గలిపుర పోలీస్‌స్టేషన్‌ విచారిస్తోంది. దాడికి గురైన చేతన్ చంద్ర ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతేకాకుండా దాడి ఘటనకు సంబంధించి చేతన్ చంద్రపై కౌంటర్ ఫిర్యాదు కూడా దాఖలైంది.

అసలేం జరిగిందంటే?

పలు కన్నడ సినిమాల్లో నటించిన నటుడు చేతన్ చంద్రపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన బెంగళూరులోని కగ్గలిపూర్ సమీపంలో చోటు చేసుకుంది. చేతన్ చంద్ర కారును అడ్డుకుని దాదాపు 20 మంది వ్యక్తులు దాడి చేశారు. అనంతరం చేతన్ చంద్ర సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. దాడి అనంతరం కగ్గలిపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మే 12న మదర్స్ డే సందర్భంగా తన తల్లిని గుడికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా చేతన్ చంద్రపై దుండగులు దాడి చేశారు. అతని కారు కూడా దెబ్బతింది. ఈ సంఘటన ఎలా జరిగిందో చేతన్ చంద్ర ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో తెలిపారు. ఇది తన జీవితంలో అత్యంత చెత్త అనుభవం అని, న్యాయం జరగాలని చేతన్ చంద్ర ఆశించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స పొందుతున్న సమయంలో చేతన్ చంద్ర ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో వచ్చి దాడి గురించి వివరించాడు.

- Advertisement -

‘ఈరోజు ఓ చేదు సంఘటనలో చిక్కుకున్నాను. వారు నా కారును ఢీకొట్టారు. అతను తాగి వచ్చి నా కారును అడ్డుకున్నాడు. ఇదేంటని అడిగితే 20 మంది కలిసి నన్ను కొట్టారు. దానికి సంబంధించిన వీడియో ఉంది. ముక్కు పగలగొట్టాడు. కగ్గలిపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రథమ చికిత్స చేయించుకోవడానికి వచ్చాను. ఇప్పుడు మళ్లీ వచ్చి కారును ధ్వంసం చేశారు. చాలా చెడ్డ వ్యక్తులు’ అని చేతన్ చంద్ర అన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు చేతన్ చంద్రపై దాడి  చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇది కేసుకు ఒకవైపు మాత్రమే. ఇంకో కోణం ఏంటంటే..

మహిళతో అనుచిత ప్రవర్తన కారణంగానే చేతన్ పై దాడి ?

నిన్న రోడ్డుపై ప్రయాణిస్తుండగా చేతన్ నా భర్తకు మధ్య వేలు చూపించాడు. తర్వాత బేకరీ దగ్గర నా భర్త బైక్‌ను ఆపడంతో చేతన్ వచ్చి ఢీ కొట్టాడు. ఆ సమయంలో నేను బేకరీ దగ్గరే ఉన్నాను. నేను వెళ్లి క్షమాపణ చెప్పినా పట్టించుకోకుండా చేతన్ నన్ను కూడా కొట్టాడు. నన్ను కొట్టినప్పుడే చేతన్‌ని అక్కడున్న జనం కొట్టారని ఐశ్వర్య పేర్కొంది.

చేతన్ పై కేసు నమోదు

దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరణ్ భార్య ఐశ్వర్య చేతన్‌పై కౌంటర్‌ ఫిర్యాదు చేసింది. తనపై, తన భర్త కిరణ్‌పై నటుడు దాడి చేశారని ఐశ్వర్య ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐశ్వర్య కగ్గలిపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. చేతన్ చంద్రతో పాటు మరో ఇద్దరిపై ఐపిసి సెక్షన్ 323, 354, 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు