Chinmayi: 5 నెలల పాపపై అఘాయిత్యం.. అనుచిత వ్యాఖ్యలు చేసిన సింగర్..!

Chinmayi: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. గానంతో ఎంతో మంది శ్రోతలను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేసింది.. ముఖ్యంగా సమంత వంటి హీరోయిన్లకు చాలా సినిమాలలో వాయిస్ అందించిన చిన్మయి సమంత కారణంగానే పలు అవకాశాలు అందుకుందని సమాచారం. ఇక ఈమె వ్యక్తిగత జీవితం పక్కన పెడితే.. సమాజంలో జరిగే ప్రతి అంశాలపై కూడా నిత్యం స్పందిస్తూ.. తనదైన స్టైల్ లో కామెంట్లు చేస్తూ ఉంటుంది.. ఈ క్రమంలోనే సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అఘాయిత్యాలపై , ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాల గురించి నోరు విప్పుతూ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే తాజాగా 5 నెలల చిన్నారిపై ఆమె తాత చేసిన అఘాయిత్యానికి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పలు రకాల ప్రశ్నలు సంధిస్తూ.. సెటైరికల్ కామెంట్లు కూడా చేసింది చిన్మయి.

Chinmayi: Atrocity on 5 months baby.. Singer who made inappropriate comments..!
Chinmayi: Atrocity on 5 months baby.. Singer who made inappropriate comments..!

ఐదు నెలల చిన్నారిపై అఘాయిత్యం..

తాజాగా చిన్మయి తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఇందుకు సంబంధించిన వార్తను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురైంది. అసలు విషయంలోకి వెళితే ఎనిమిదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన ఘటన ఇంకా మరువకముందే ఐదు నెలల చిన్నారిని వరుసకు తాత అయ్యే వ్యక్తి అత్యాచారం చేయడం నిజంగా ఇంతకంటే ఘోరం మరెక్కడా ఉండదేమో.. అసలు విషయంలోకెళితే.. విజయనగరం జిల్లాలో ఐదు నెలల చిన్నారిపై ఒక కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.. జీలుగు వలసలో ఐదు నెలల వయసున్న చిన్నారిని ఉయ్యాలలో నిద్రపుచ్చి తల్లి పక్కనే ఉన్న దుకాణానికి వెళ్ళింది. ఇక ఇంట్లో ఎవరూ లేనిది చూసిన..ఆ వ్యక్తి ఊయలలో నిద్రిస్తున్న చిన్నారిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాప గట్టిగా అరవడంతో.. ఆ తల్లి పెద్ద కుమార్తె హుటాహుటిన అక్కడికి వచ్చింది.. అప్పటికే నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు. విషయం తల్లికి చెప్పగా హుటాహుటిన ఇంటికి చేరుకుంది. ఇక రక్తం మడుగులో ఉన్న చిన్నారిని చూసి చలించిపోయిన ఆ తల్లి వెంటనే ఆసుపత్రికి తరలించింది. ఇక ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా చిన్నారి ఆరోగ్యంగానే ఉందని వైద్యులు నిర్ధారించారు అయితే ఇప్పటికీ పాపకు రక్తస్రావం అవుతున్నట్లు స్పష్టం చేశారు ఇక నిందితుడి కోసం స్థానికులు , పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం .

సింగర్ చిన్మయి అనుచిత వ్యాఖ్యలు..

ఇక ఈ విషయంపై సింగర్ చిన్నవి స్పందించింది. ఐదు నెలల చిన్నారి ఉయ్యాలలో నిద్రిస్తూ ఉండగా వరుసకు కాదా ఆయన వ్యక్తి పాపను రేప్ చేశారు.. పాప అత్యాచారానికి గురైందని వైద్యులు నిర్ధారించారు.. సేఫ్టీ లేదు అని చెబుతున్నప్పుడు మనోభావాలు దెబ్బలు తగిలి.. కేసు వేసిన గొప్ప వ్యక్తులు ఎక్కడ..? ఫెమినిజం అనవసరం… ఆడవారు స్వతంత్రాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు అంటూ వాగుతున్న గొప్ప వ్యక్తులు ఎక్కడ అంటూ ప్రశ్నించింది.. ఐదు నెలల చిన్నారికి కూడా ఫ్రీడం లేదు.. వరుసకు తాత అయిన కూడా ఆ రేపిస్ట్ గారు చేసింది.. కేవలం ఆ పాప ను రేప్ చేయడానికి వెజైనల్ ఏరియా మాత్రమే చూశాడు.. అయినా తప్పంతా ఆ చిన్నారిదే.. ఎవరు చెప్పారు పాపని పడుకోమని.. ఆడపిల్లగా పుట్టి తాతని టెంప్ట్ చేసిందండి.. దుపట్టా వేసుకోవాలిగా.. 100% చున్నీతో ఫ్యామిలీ గౌరవం కాపాడుకోలేక పోయింది.. పాపం ఎవరైనా వెళ్లి మన కల్చర్, రెస్పెక్ట్ నేర్పించండి రా ఆ పాపకి అంటూ సెటైరికల్ గా కామెంట్లు చేసింది. ప్రస్తుతం చిన్మయి భావోద్వేగంతో సెటైరికల్ గా చేసిన పోస్ట్ వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు