Chiranjeevi – Balakrishna : ఇండస్ట్రీని శాసించే హీరోలు.. ఎన్నాళ్ళు ఇలాంటి పాత్రలు వేస్తారు!

Chiranjeevi – Balakrishna : టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రహీరోలుగా ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ ఇప్పటికీ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. నేటి యంగ్ స్టార్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ అభిమానులని అలరిస్తున్నారు. పైగా టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోలలో సగం మంది ఈ ఫ్యామిలీ నుండే ఉండగా, ఇండస్ట్రీని శాసించే హీరోలుగా చిరంజీవి, బాలయ్యలకు మంచి పేరుంది. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పాత్రలు గాని, గాని సినిమాలు గాని ఓ రకంగా అభిమానులకే నచ్చడం లేదు. ఒకే రకమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నారు.

Chiranjeevi-Balakrishna gets trolled on social media

మళ్ళీ మాస్ బాటలో బాలయ్య.., వయసుకు తగ్గ పాత్రలు చేయని చిరు..

ముందుగా బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. గత రెండు దశాబ్దాల నుండి బాలయ్య చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. అందులో 30 సినిమాలుంటే హిట్ అయినవి ఓ ఏడు సినిమాలు. ఏళ్ళ తర్వాత అఖండ తో కం బ్యాక్ ఇచ్చిన బాలయ్య, ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరితో హిట్లు కొట్టాడు. అయితే ఒకసారి సరిగ్గా గమనిస్తే.. బాలయ్య చేస్తున్న సినిమాలన్నీ మాస్ జోనర్ లోనే తెరకెక్కుతున్నాయి. బాలకృష్ణ మాస్ హీరో అన్న విషయం ఎంత నిజమో, అప్పుడప్పుడు కొత్త జోనర్ లో, కనీసం ఫ్యామిలీ తరహా సినిమాలైనా చేయాలనీ ఆడియన్స్ కోరుకుంటున్నారు. సినిమాలు ఆడుతున్నాయి కదా అని అవే తరహా పాత్రలు చేస్తుంటే మరోసారి మార్కెట్ తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు నెటిజన్లు.

- Advertisement -

ఇక చిరంజీవి విషయానికి వస్తే..అభిమానుల దృష్టిలో మరింత లోకువ అయిపోతున్నారని చెప్పాలి. పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినపుడు ఇండియాలోనే ఆ రేంజ్ కం బ్యాక్ ఎవ్వరికీ రాలేదని అన్నారు. కానీ ఆ తర్వాత చేస్తున్న పాత్రలన్నీ అభిమానులకు నచ్చడం లేదు. ఒక్క సైరా, గాడ్ ఫాదర్ మినహా అన్ని వయసులో ఉన్న పాత్రల్లా డిజైన్ చేసారు మేకర్స్. త్వరలో 70 లోకి అడుగుపెట్టనున్న చిరుకు ఇంకా వయసులో ఉన్న పాత్రల్లో చూడలేకపోతున్నారు అభిమానులు. ముఖ్యంగా హీరోయిన్లతో పాటల్లో చూడడానికి ఆడియన్స్ కి ఎబ్బెట్టుగా ఉంది.

ఎన్నాళ్ళు ఇలాంటి పాత్రలు?

ఇక సోషల్ మీడియాలో అభిమానుల మధ్య వార్లు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి కానీ, మామూలు సినీ ప్రేక్షకులు మాత్రం వీళ్ళ పాత్రలపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఇలా ఒకే తరహా పాత్రలు చేస్తారని విమర్శిస్తున్నారు. బాలయ్య ఒకే మాస్ పాత్రల్లో, చిరంజీవి వయసు తగ్గని పాత్రల్లో నటించడం ఇకనైనా మానుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవిని వయసుకి తగ్గ సీనియర్ పాత్రలు చేయమని మెగాభిమానుల నుండే గట్టి కంప్లైంట్ ఉంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ బాబీ తో NBK109 చేస్తుండగా, చిరంజీవి విశ్వంభర చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు