Sankranthi War : 24ఏళ్లకు సీనియర్ స్టార్ల సమరం.. ఈసారి నెగ్గేదెవరో?

Sankranthi War : టాలీవుడ్ లో అతిపెద్ద సినిమాల సీజన్ ఏది అంటే సంక్రాంతి సీజన్ అని చెప్పాలి. ప్రతి ఏటా సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు పందెం కోళ్లలా పోటీ పడుతూ ఉంటాయి. సంక్రాంతి పండగ ముగిసే వరకు టాక్ తో సంబంధం లేకుండా పెద్ద సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. పలు సినిమాలు సంక్రాంతి వచ్చి ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసిన సందర్భాలున్నాయి. ఇక ఈ ఏడాది కూడా బడా స్టార్ హీరోల సినిమాలు ప్రతిష్టాత్మకంగా రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈసారి అన్నీ సీనియర్ స్టార్ హీరోల సినిమాలే ఉండడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమాలు 2025 సంక్రాంతి కి పోటీ పడనున్నాయి. అయితే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ముగ్గురి మధ్య సంక్రాంతి వార్ (Sankranthi War) జరగబోతుండడం విశేషం.

Chiranjeevi, Balakrishna, Venkatesh clash in 2025 Sankranthi War

24 ఏళ్ళ తర్వాత సీనియర్ స్టార్ల సమరం…

అయితే సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ పలుమార్లు సంక్రాంతి పండక్కి పోటీ పడ్డారు కానీ, అయితే చివరగా మాత్రం 2001 లో వీరు పోటీ పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి మృగరాజు సినిమాతో, నందమూరి బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాతో, వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి బరిలో పోటీపడగా, ఆ పోటీలో మృగరాజు, దేవిపుత్రుడు పరాజయం చెందగా, నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఇక దానికి ముందు కూడా 2000 లో వెంకటేష్ కలిసుందాం రా, చిరంజీవి అన్నయ్య, బాలకృష్ణ వంశోద్ధారకుడు సినిమాలతో పోటీపడగా, కలిసుందాం రా, అన్నయ్య సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవగా, వంశోద్ధారకుడు డిజాస్టర్ అయింది. ఇక ఇప్పుడు మళ్ళీ వీరు ముగ్గురు రెండు దశాబ్దాల తర్వాత సంక్రాంతి బరిలో నిల్చుంటున్నారు.

- Advertisement -

 

సీనియర్ స్టార్ల సమరంలో గెలిచేదెవరు?

ఇక సరిగ్గా 24 ఏళ్ళ తర్వాత ఈ సీనియర్ స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడనున్నారు. 2025 సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ ముగ్గురూ మళ్ళీ పోటీపడుతున్నారు. చిరంజీవి వశిష్ఠ మల్లిడి తో చేస్తున్న విశ్వంభర సినిమాతో వస్తుండగా, బాలకృష్ణ బాబీతో చేస్తున్న NBK109 తో వస్తున్నాడు. ఇక వెంకటేష్ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాతో పోటీలో నిల్చుంటున్నాడు. అయితే ఈ సినిమాలు పక్కాగా సంక్రాంతి కి వస్తాయా అన్న విషయం కూడా చెప్పలేం. ఎందుకంటే కొన్ని సినిమాల షూటింగ్ లేట్ గా మొదలవగా, రిలీజ్ టైం నాటికి ఏదైనా తప్పుకునే ఛాన్స్ కూడా ఉంది. ఏది ఏమైనా దాదాపుగా ఈ ముగ్గురి సినిమాలు వస్తే.. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. మరి చివరిసారి ఈ ముగ్గురు పోటీపడినపుడు బాలకృష్ణ విజేతగా నిలవగా, ఈ సంక్రాంతి కి సీనియర్ స్టార్ హీరోల బాక్స్ ఆఫీస్ వార్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు