Chiranjeevi : ప్రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఏ మాత్రం జోష్ తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు చిరంజీవి. రీసెంట్ గా లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాతో మంచి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్ట్మాకంగా నిర్మించిన చిత్రం వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి 154th సినిమాగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య లో చిరంజీవికి జోడిగా శృతి హస్సన్న టించింది. ACP విక్రమ్ సాగర్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవి తేజా సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రవి తేజా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదులైన మాస్ సాంగ్స్ ఫాన్స్ తో డాన్సులు చేస్తున్నాయి. మెగాస్టార్ సినిమా కావడంతో, ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగి పోతున్నాయి.

సంక్రాతి కానుకగా వాల్టెయిర్ వీరయ్య జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దెగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రొమొతిఒన్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జనవరి 8న వైజాగ్‌ గ్రాండ్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తునట్టు తెలుస్తుంది. అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.
ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించాగా దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు