Indra Re Release : చిరంజీవి రాజకీయ ప్రస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సీన్స్ చెయ్యలేదు – బి. గోపాల్

Indra Re Release : మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లు దాదాపు అన్ని జోనర్స్ లో కూడా సినిమాలు చేశారు. ఇంద్ర సినిమా వరకు మెగాస్టార్ చిరంజీవి ఒక ఫ్యాక్షన్ సినిమా కూడా చేయలేదు. ఆ తరుణంలో వైజయంతి బ్యానర్స్ పై బి.గోపాల్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఇంద్ర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలన్నిటినీ మించి ఇంద్ర సినిమా ఉంటుంది. ఇంద్ర సినిమాలో ప్రతి ఎలిమెంట్ అద్భుతంగా వర్కౌట్ అయింది.

ఈ సినిమాకి చిన్ని కృష్ణ అందించిన కథ, మణిశర్మ అందించిన మ్యూజిక్, పరుచూరి గోపాలకృష్ణ అందించిన డైలాగ్స్ వీటన్నిటిని మించి బిగోపాల్ దర్శకత్వం ఇవన్నీ కూడా సినిమాను ఒక రేంజ్ లో నిలబెట్టాయి. అన్ని అంశాలు కూడా ఈ సినిమా కథకి సరిగ్గా కుదిరాయి. నేడు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాను రిలీజ్ చేశారు. ప్రస్తుతం మరోసారి 22 ఏళ్లు తర్వాత ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

Indra

- Advertisement -

ఇంద్ర సినిమాలో చాలా సీన్స్ చాలామందికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అయితే ఈ సినిమాలోని చాలా సీన్స్ ను మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారు అని ముందే గ్రహించి తీశారు అనేటట్లు ఉంటాయి. అయితే వీటి గురించి క్లారిటీ ఇచ్చారు దర్శకులు, ఇంద్ర సినిమా చివర్లో కూడా ఇద్దరిలో ఏ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోకుండా మ్యాన్ ఫర్ ది పీపుల్ అనే ఒక కార్డుతో సినిమా ఎండ్ అవుతుంది. అంటే ప్రజల కోసం అని అర్థం. అయితే ఇక్కడితోనే మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానం మొదలైంది అని చాలామంది భావిస్తారు. వాస్తవానికి సినిమా కథ అలా డిమాండ్ చేయటం వలన అలా వేయాల్సి వచ్చింది. కానీ అప్పటికే మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంది అని కూడా మాకు తెలియదు అంటూ బి గోపాల్ క్లారిటీ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు