Chiranjeevi: చిరు కాళ్లపై పడ్డ ఈ బుడ్డోడు..ఇప్పుడు స్టార్ హీరో అని మీకు తెలుసా..?

Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే, ఆయనతో తమకున్న జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో చిన్నప్పుడు చిరంజీవితో తనకున్న అనుబంధం గురించి షేర్ చేస్తూనే, చిరంజీవి కాళ్ల పడి, ఆశీర్వాదం తీసుకుంటున్న తన చిన్నప్పటి ఫోటోని షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నాడు. మరి పైన ఫోటోలో చిరంజీవి కాళ్ళ మీద పడ్డ ఆ బుడ్డోడు ఇప్పుడు ఎవరో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.. మరి ఆ చిన్న పిల్లవాడు ఎవరు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం

Chiranjeevi: Did you know that this little boy who fell on his feet is now a star hero?
Chiranjeevi: Did you know that this little boy who fell on his feet is now a star hero?

చిరంజీవి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న బుడ్డోడు..

చిరంజీవి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఈ బుడ్డోడు ఎవరో కాదు మెగా ఫ్యామిలీ హీరోనే.. అయితే రామ్ చరణ్ కాదండోయ్ మెగా బ్రదర్ నాగబాబు (Nagababu )తనయుడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్(Varun tej)చిన్నప్పుడు తన పెదనాన్న కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోని అలాగే తన పెళ్లిలో చిరంజీవిని కౌగిలించుకున్న ఫోటోని , దాంతోపాటు చిరంజీవి తో చిన్నప్పుడు ఆడుకున్న ఫోటోలను షేర్ చేసి తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు వరుణ్ తేజ్ షేర్ చేసిన ఫోటోలలో చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు కూడా ఉన్నారు.

నువ్వే మా ఇన్స్పిరేషన్..

ఈ ఫోటోలు షేర్ చేయడంతో పాటు.. మాకు ప్రతి సమస్యని నవ్వుతో ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. ప్రేమ, అనుబంధాలతో మమ్మల్ని పెంచినందుకు మీకు ధన్యవాదాలు. మీరే మాకు ప్రతి పెద్ద ఇన్స్పిరేషన్.. మాతో మీరు ఉన్నందుకు ధన్యవాదాలు.. హ్యాపీ బర్త్డే డాడీ అంటూ ఎమోషనల్ గా ఒక పోస్ట్ చేశాడు వరుణ్ తేజ్ . ప్రస్తుతం వరుణ్ తేజ్ చేసిన పోస్ట్ కి అభిమానులు సైతం లైకులు, షేర్లతో తెగ వైరల్ చేసేస్తున్నారు.

- Advertisement -

వరుణ్ తేజ్ కెరియర్..

ఇక వరుణ్ తేజ్ కెరియర్ విషయానికి వస్తే , సహా నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు వినిపించినా.. ఆ వార్తలపై ఎవరు స్పందించలేదు. కానీ ఎట్టకేలకు గత ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకుని, అదే ఏడాది నవంబర్లో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. ఇక ఇటీవలే భార్య లావణ్య త్రిపాఠి తో కలిసి తిరుమల శ్రీ వారిని వరుణ్ తేజ్ దర్శించుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ కెరియర్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వరుణ్ తేజ్. మరొకవైపు వివాహం తర్వాత కుటుంబానికి పరిమితమైంది లావణ్య త్రిపాఠి. మరి మంచి సక్సెస్ కోసం కథలు వింటుందా లేక మెగా కుటుంబానికి తన కెరియర్ను అంకితం చేసిందా అనే విషయం తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు