Vijay Shanti: చిరంజీవి నన్ను వాటికి పిలిచేవారు కాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి..!

Vijay Shanti: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ‌ విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. లేడీ ఫైటర్ గా తాను ముద్ర వేసుకుంది. ఇక ఈ నటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇలా సీనియర్ హీరోలతో జతకట్టి మెప్పించింది.

మరీ ముఖ్యంగా చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే విజయశాంతి లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చిరు పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. యాంకర్.. 18 బ్యాచ్కు చెందిన ఆర్టిస్టులంతా ప్రతి సంవత్సరం ఒక చోట కలిసి ఎంజాయ్ చేస్తారు కదా మీరు ఆ పార్టీకి ఎందుకు వెళ్లరు అని ప్రశ్నించగా.. దానికి విజయశాంతి స్పందిస్తూ..” నన్ను చిరంజీవి ఎప్పుడూ ఆ పార్టీలకు పిలవలేదు.

Chiranjeevi didn't call me that.. Vijay Shanti made shocking comments
Chiranjeevi didn’t call me that.. Vijay Shanti made shocking comments

పిలిచినా నేను వెళ్ళను. అలాంటి పార్టీలకు నేను చాలా దూరంగా ఉంటాను. షూటింగ్, రాజకీయాలు, ఇల్లు అంతే తప్పితే పార్టీలకు వెళ్ళను. అందువల్లే నన్ను అటువంటి పార్టీలకు చిరు సైతం పిలవరు. వాటిల్లో నేను కనిపించను. ” అంటూ చెప్పుకొచ్చింది విజయశాంతి. ప్రెసెంట్ ఈ రాములమ్మ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం విజయశాంతి కళ్యాణ్ రామ్ హీరోగా నటించబోతున్న సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు