Malayala Star : చిరంజీవిని ఘోరంగా అవమానించిన మలయాళ హీరో..?

Malayala Star : మెగాస్టార్ చిరంజీవి వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. చిరు లాంటి స్టార్ తో నటించాలని చాలామంది స్టార్స్ ఆత్రుత చూపిస్తారు.. అయితే ఓ స్టార్ హీరో మాత్రం చిరంజీవి సినిమాలో నటించాలని అడిగితే నో చెప్పినట్లు తెలుస్తుంది.. ఇది చిరంజీవి ఫ్యాన్స్ ఘోర అవమానం అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. అంతేకాదు ఇప్పుడు ఓ హీరో సినిమాలో విలన్ గా చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

ఇంతకీ ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదు ఇటీవల ‘ది గోట్ లైఫ్’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్‌.. మలయాళం టాప్ హీరోలలో ఒకడు.. అలాగే తెలుగులో పలు సినిమాల్లో విలన్ గా నటిస్తున్నాడు.. అయితే గతంలో చిరంజీవి ఆచార్య సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదిస్తే సినిమాలతో బిజీగా ఉండటంతో నో చెప్పినట్లు తెలుస్తుంది.. ఇప్పుడే మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోతున్న SSMB29 సినిమాలో నటించబోతున్నాడని సమాచారం..

Chiranjeevi is the Malayalam star hero who rejected the movie
Chiranjeevi is the Malayalam star hero who rejected the movie

రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది ప్రారంభిస్తారని తెలిసిందే. ఈ మూవీ కోసమే మహేష్ బాబు జుట్టుని పెంచుకుంటున్నాడు. హెయిర్ స్టైల్ పూర్తిగా మారబోతోంది. లుక్ మాత్రం డిఫరెంట్‌గా, ఇది వరకెన్నడూ చూడని విధంగా ఉంటుంది. అయితే ఈ మూవీ కోసం మాలీవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్‌ పృథ్వీరాజ్ సుకుమార్‌ను విలన్‌గా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఈ సినిమాలోని నటీనటుల గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు టాక్.. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టారు.. అంతేకాదు సినిమా కథను కూడా దాదాపు పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఈ నెలాఖరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు