Tollywood : సీనియర్ హీరోల్లో చిరునే తోపు… రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లు అంటే?

Tollywood : మెగాస్టార్ చిరంజీవి పారితోషకం విషయంలో మిగతా సీనియర్ హీరోలను వెనక్కి నెట్టేశారు. తాజా సమాచారం ప్రకారం మిగతా ముగ్గురు హీరోల కంటే చిరునే ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే నెక్స్ట్ మూవీ కోసం ఆయన రికార్డు స్థాయిలో పారితోషకం అందుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇంతకీ మెగాస్టార్ రెమ్యూనరేషన్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే…

ఈ ఏడాది మెగాస్టార్ రెండు సినిమాలు చేయబోతున్నారు. ఇప్పటికే “బింబిసార” ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఓ మూవీ షూటింగ్ దశలో ఉంది. కానీ చిరంజీవి ఇంకా ఆ సెట్ లో అడుగు పెట్టలేదు. ఈ మూవీకి “విశ్వంభర” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. టైటిల్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. ఇక ఈ సినిమాకు చిరు 40 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నారని టాక్. తన తర్వాత మూవీకి మరో 10 కోట్లు పెంచి రౌండ్ ఫిగర్ 50 కోట్లు తీసుకోబోతున్నారట చిరంజీవి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ మూవీ రాబోతుందన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీతో చిరంజీవిలో ఉన్న వింటేజ్ కామెడీ టైమింగ్ బయటకు తీసి, తనదైన స్టైల్ లో మూవీ తీస్తాడని అంతా ఆశిస్తున్నారు. ఈ మూవీకి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ మూవీకి చిరంజీవికి దిల్ రాజు ఏకంగా 50 కోట్లు ఆఫర్ చేశారని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ వార్తలు కనుక నిజమైతే ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలు అందరిలోనూ చిరంజీవే అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా రికార్డును క్రియేట్ చేస్తారు.

- Advertisement -

ఈ విధంగా చూసుకుంటే నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కంటే పారితోషికం విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక అడుగు ముందే ఉన్నారు. వీళ్ళందరి కంటే ముందుగా 50 కోట్ల క్లబ్ లో చేరబోతున్నారు చిరంజీవి. ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కో సినిమాకు 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరోవైపు నాగార్జున “నా సామి రంగ” మూవీకి 10 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నట్టు టాక్. ఇక వెంకటేష్ కూడా దాదాపుగా 10 కోట్ల వరకు తీసుకుంటున్నారు. దీంతో ఈ నలుగురిలో భారీ పారితోషికం అందుకుంటున్న సీనియర్ హీరోగా చిరంజీవి నిలిచారు. కాగా దిల్ రాజు ఇప్పటిదాకా పలువురు మెగా హీరోలతో కలిసి పని చేశారు కానీ చిరంజీవితో ఆయనకు ఇదే మొదటి మూవీ.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు