Vashista: బింబిసార దర్శకుడితో చిరంజీవి

బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వశిష్ఠ ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. కళ్యాణ్ రామ్ లాంటి హీరోతో పీరియాడిక్ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినందుకు అందరు వశిష్ఠని అభినందించారు. బింబిసార లాంటి కాంప్లెక్స్ కథలో కూడా ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవకుండా చాలా సినిమాల అనుభవం ఉన్న దర్శకుడిలా అందరిని మెప్పించే సినిమా తీశారు వశిష్ఠ. అయితే వశిష్ఠ బింబిసార తరువాత పార్ట్ 2 చేయాల్సి ఉంది. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల వశిష్ఠ బింబిసార పార్ట్2 నుంచి బయటికి వచ్చి వేరే సినిమా ప్లాన్ చేసే పనిలో పడ్డారు.

ఆ మధ్య బాలకృష్ణ.. బింబిసార స్పెషల్ షోకి వచ్చినపుడు ఏవైనా కథ ఉంటే చెప్పు చేద్దాం అని వశిష్ఠతో అన్నారు. అయితే వశిష్ఠ బాలకృష్ణకి ఫ్యాన్ అవడంతో ఆయనే స్వయంగా అడిగారని కథ సిద్ధం చేసే పనిలో పడ్డారు. కానీ బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా తరువాత బోయపాటితో అఖండ 2 చేయబోతున్నారు. అందువల్ల వశిష్ఠ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళింది.

బాలయ్య ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లడంతో మరో కథని సిద్ధం చేసిన వశిష్ఠ.. చిరంజీవిని కలిసి కథ వినిపించారు. చిరంజివికి కథ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పారు అంట. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తోన్న భోళా శంకర్ సినిమాలో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకి చేరుకుంది. ఈ ఏడాది ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకి రానుంది.

- Advertisement -

భోళా శంకర్ సినిమా తరువాత చిరంజీవి వశిష్ఠల సినిమా మొదలవుతుందనే వార్త గట్టిగ వినిపిస్తోంది. అయితే చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నారంట.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు