Chiranjeevi: ఈ జీవితమే అమ్మది..చిరంజీవి ఎమోషనల్‌

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ఇంకా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీ లోకి వచ్చే క్రమంలో అనేక కష్టాలు పడ్డా మెగాస్టార్ చిరంజీవి… ఆ తర్వాత నిల దొక్కుకొని సక్సెస్ అయ్యారు. ఇండస్ట్రీ కొత్తలో… చిన్న చిన్న పాత్రలు చేసిన మెగాస్టార్ చిరంజీవి… ఆ తర్వాత బడా హీరో అయిపోయారు.

అంతేకాదు ప్రజారాజ్యం పేరుతో కొత్త రాజకీయ పార్టీని పెట్టి ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనమే సృష్టించారు. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలనుంచి తప్పుకొని… ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తున్నారు. రీఎంట్రీలో కూడా అదరగొడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే తాజాగా మదర్స్ డే సందర్భంగా తన తల్లి గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి.

జన్మనిచ్చి, పెంచి, పోషించిన తన అమ్మకు శుభాకాంక్షలు చెప్పారు. ఒకరోజు ఏంటి… ప్రతిరోజు అమ్మది… ఈ జీవితం అమ్మకోసమే అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన భార్య, తల్లితో కలిసిన ఫోటోను షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా… అటు ఏపీ రాజకీయాలపై కూడా మొన్న ఒక వీడియో పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. పిఠాపురం నియోజకవర్గంలో తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరారు. కష్టం విలువ తెలిసిన వాడని… ప్రజలంటే చచ్చిపోతాడని… అలాంటి నాయకున్ని గెలిపించుకోవాలని కోరారు మెగాస్టార్ చిరంజీవి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు