Star Heros : బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత బిగ్గెస్ట్ ప్లాప్స్… ఈ ముగ్గురు లెజెండరీ హీరోలు తెలుసుకుందేంటి?

Star Heros : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న లెజెండరీ స్టార్ హీరోల్లో చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ ఒకరు. నాలుగున్నర దశాబ్దాలుగా సౌత్ ఇండియాలో అగ్ర హీరోలుగా కొనసాగుతూ ఇప్పటికి అదే స్థానాన్ని, అదే రేంజ్ ని మెయింటైన్ చేస్తున్నారు ఈ హీరోలు. అయితే గత కొన్నాళ్లుగా మాత్రం వీరి నుండి వచ్చే సినిమాలు అభిమానులని అంతగా మెప్పించలేదన్న మాట వాస్తవం. ఈ తరుణంలో వాళ్ళు ఏం మిస్సయ్యారో తెలుసుకున్నారు. ముందుగా కమల్ హాసన్ పదేళ్లుగా ఫామ్ లో లేకపోగా, ఎట్టకేలకు సరైన కంటెంట్ తో “విక్రమ్” సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు. ఆ వెంటనే మెగా స్టార్ చిరంజీవి లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య అంటూ బ్లాక్ బస్టర్ కం బ్యాక్ ఇచ్చారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా లాస్ట్ ఇయర్ జైలర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు. అయితే ఈ సినిమాల వెంటనే వచ్చిన ఈ ముగ్గురి (Star Heros) నెక్స్ట్ సినిమాలు బిగ్గెస్ట్ ప్లాప్ లుగా నిలిచాయి.

Chiranjeevi, Rajinikanth and Kamal Haasan received the biggest disasters

బిగ్గెస్ట్ ప్లాప్స్ అందుకున్న ముగ్గురు లెజెండ్స్…

అయితే ఈ ముగ్గురు సీనియర్ స్టార్స్ పెద్ద హిట్ కొట్టిన వెంటనే బిగ్గెస్ట్ ప్లాప్ అందుకున్నారు. చిరంజీవి భోళా శంకర్ తో డిజాస్టర్ అందుకోగా, రజినీకాంత్ లాల్ సలాం తో డిజాస్టర్ అందుకున్నారు. లేటెస్ట్ గా కమల్ హాసన్ ఇండియన్2 తో బిగ్గెస్ట్ ప్లాప్ అందుకున్నారు. ఇలా కం బ్యాక్ ఇచ్చిన వెంటనే మూడు బిగ్గెస్ట్ ప్లాప్స్ అందుకున్నారు ఈ లెజెండ్స్. ఈ సినిమాలను అసలు వారి ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదంటే ఎంత దారుణంగా తిరస్కరించారో చెప్పనక్కర్లేదు. మరి దీనికి కారణాలేంటి అన్నది ఆ హీరోలకే తెలియాలి.

- Advertisement -

ఇప్పటికైనా ఈ హీరోలు తెలుసుకుంటారా?

ఇక చిరు, రజిని, కమల్ సినిమాలు అంత దారుణంగా ఫెయిల్ అవడానికి ఒక్కో దానికి ఒక్కో కారణం ఉంది. చిరంజీవికి రీమేక్ వద్దు అని అప్పటికే అభిమానులు వారించినా వినకుండా, భోళా శంకర్ అంటూ రొటీన్ సినిమాతో వచ్చారు. ఇప్పటికైనా రీమేక్ లు చేయడం మానుకుంటే మంచిదని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక రజినీకాంత్ లాల్ సలాం తో డిజాస్టర్ అందుకోవడానికి కారణం తన కూతురే. రజిని కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఈ సినిమా డైరెక్ట్ చేయగా, అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే తో తండ్రికి రిజస్టర్ ఇచ్చింది. ఇంతకు ముందు కూడా తన కూతురు కొచ్చడియాన్ తో డిజాస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక కమల్ విషయానికి వస్తే.. అసలు క్లాసిక్ మూవీ అయిన ఇండియన్ కి పాతికేళ్ల తర్వాత సీక్వెల్ తీయడమే అభిమానులకు రుచించలేదు. పైగా బోరింగ్ స్క్రీన్ ప్లే తో రావడం వల్ల ప్రేక్షకులు దారుణంగా తిరస్కరించారు.

అయితే ఈ ముగ్గురు లెజెండరీ స్టార్ హీరోలకి ఇప్పటికి యంగ్ స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి బాక్స్ ఆఫీస్ వద్ద భీభత్సం సృష్టించే స్టామినా ఉంది. ఇది గమనించి ఇప్పటికైనా పాత కాలం స్క్రిప్ట్ లకు సెంటిమెంట్ లకు స్వస్తి పలికి కొత్త తరహా స్క్రిప్ట్ లు చేయడం లో జాగ్రత్త వహించాలని అభిమానులతో పాటు ట్రేడ్ విశ్లేషకులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు