Tollywood : సీఎం విజ్ఞప్తికి స్పందించిన పద్మవిభూషణ్ చిరంజీవి! ఏమన్నారంటే…

Tollywood : తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్ల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న టైం లో ప్రతి యేటా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెండితెర, బుల్లితెర చిత్ర పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 24 క్రాఫ్ట్ కి చెందిన వాళ్లకు ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇచ్చే సంప్రదాయాన్ని పాటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా రాజకీయ సినీ ప్రముఖులు కలిసి ఘనంగా ఈ వేడుక జరిపేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు ఎలాంటి అవార్డులు ఇవ్వకపోగా, ఏపీ ప్రభుత్వం కొంత కాలం ఈ అవార్డులు ఇచ్చారు. కానీ తెలుగు రాష్ట్రాలలో ఎవరూ ఆ పని చేయలేకపోయారు. అయితే ఈ ఇయర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత, నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చి ప్రభుత్వం తరపున ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రకటించారు. కొన్ని నెలల ముందే అధికారికంగా ప్రకటించారు కూడా, అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవి సహా ప్రముఖులు పలు కార్యక్రమాల్లో దీని గురించి ప్రశంసించారు.

Chiranjeevi responded to CM Revanth Reddy's appeal on Gaddar Awards

ఆవేదన వ్యక్తం చేసిన సీఎం..

అయితే తాజాగా ఓ కార్యక్రమంలో గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు సినీ పరిశ్రమ నుండి సినీ ప్రముఖుల స్పందన రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి లో గద్దర్ అవార్డుల ప్రతిపాదన విన్నవించగా, మరోసారి దీనిపై ప్రస్తావించారు. అయితే గద్దర్ అవార్డుల విషయం పై చాలా నెలలు కావస్తున్నా ఈ ప్రభుత్వ ప్రతిపాదనపై సినీ పరిశ్రమ ప్రముఖులు అంతగా స్పందించలేదు. వాస్తవానికి, ఈ కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై ప్రముఖుల అభిప్రాయాన్ని మరియు సూచనలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమను కోరింది. అయితే తాజాగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సీఎం ఆవేదనకు వెంటనే స్పందించారు.

- Advertisement -

సీఎం విజ్ఞప్తికి రియాక్ట్ అయిన పద్మవిభూషణ్..

అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన తనకు పద్మవిభూషణ్ వచ్చిన సమయంలోనే సన్మాన కార్యక్రమంలో దీనిపై స్పందించగా, మళ్ళీ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గానే తెలుగు చిత్ర నిర్మాతల మండలి కొత్తగా ఏర్పాటు కాగా, మరి ఈ గద్దర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఎంత ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు