Chiranjeevi Rude Behaviour: ఫ్యాన్స్ తో రూడ్ గా బిహేవ్ చేసిన మెగాస్టార్.. ఊహించలేదుగా.?

Chiranjeevi Rude Behaviour.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వయం కృషితో ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈయన అనతి కాలంలోనే 153 కి పైగా చిత్రాలలో నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే చిరంజీవి సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాదు తనదైన ఆర్థిక సహాయాలను అందిస్తూ గొప్ప మనసు చాటుకున్నారు. అడిగిన వారికి లేదనకుండా లక్షలు ధారపోసి ఉచితంగా వైద్య సేవలు అందించిన ఘనత మెగాస్టార్ చిరంజీవిది. అయితే ఒక్కొక్కసారి ఆయన ప్రవర్తన ఎదుటి వారికి రూడ్ గా ఉందని అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే చిరంజీవి చేసిన పనికి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Chiranjeevi Rude Behaviour: Megastar behaved rudely with fans.. Unexpectedly..?
Chiranjeevi Rude Behaviour: Megastar behaved rudely with fans.. Unexpectedly..?

ఫ్యాన్స్ తో రూడ్ గా బిహేవ్ చేసిన మెగాస్టార్..

తాజాగా ఎయిర్ పోర్ట్ లో కనిపించిన చిరంజీవితో ఫోటోలు దిగడానికి అభిమానులు తెగ ఎగబడ్డారు. దీంతో వారిని పక్కకు తోసేసి చిరంజీవి వెళ్లడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో అభిమానులపై చిరంజీవి రూడ్ గా బిహేవ్ చేశారంటూ నెట్టింట ఒక వార్త దుమారం రేపుతోంది.. అయితే ఈ సందర్భంలో చిరంజీవి అలా ఎలా చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఆయన అభిమానులకు ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా పక్కకు తోసేయడం మాత్రం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

మెగాస్టార్ రాజకీయ ప్రస్థానం..

మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఆకట్టుకొని మెగాస్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. వరుస సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుని రాజకీయాల్లో కూడా సత్తా చాటాలని ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఈ పార్టీతో అధికారంలోకి వచ్చి మరో ఎన్టీఆర్ అనిపించుకోవాలనుకున్నారు. కానీ ఆ కల నెరవేరలేదు. అందులో భాగంగానే పోటీ చేసి ఓడిపోవడంతో ఆ పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా కొన్ని సంవత్సరాలు పనిచేశారు. సినిమాల్లో ఉండి కూడా సమాజసేవ చేయొచ్చు అనుకున్నారు చిరంజీవి.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సినిమాలు..

అందులో భాగంగానే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి మనసున్న వ్యక్తి గా నిరూపించుకుంటున్నారు. ఇటీవలే సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు గానూ పద్మ విభూషణ్ అవార్డు తో భారత ప్రభుత్వం చిరంజీవిని సత్కరించింది. ఇక ప్రస్తుతం సినిమాల పైన దృష్టి పెట్టారు.. అందులో భాగంగానే తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం విశ్వంభర. డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాల్లో సీనియర్ హీరోయిన్ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలం తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడంతో అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి. మొత్తానికి అయితే చిరంజీవి తన సినిమాలు ద్వారా ప్రేక్షకులను అల్లరిస్తూనే ఇలా చిన్నచిన్న తప్పిదాల వల్ల వైరల్ గా మారుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు