Chiranjeevi : ప‌వ‌న్‌కి మ‌ద్ద‌తు

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం గాడ్‌ఫాద‌ర్ ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ త‌రుణంలో మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ స్పెష‌ల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్‌మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారు.

ముఖ్యంగా త‌న త‌మ్ముడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి భ‌విష్య‌త్ లో మ‌ద్ద‌తు ఇస్తాన‌ని చిరంజీవి చెప్పుకొచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంకిత భావం క‌లిగిన నాయ‌కుడు అని, అలాంటి నాయ‌కుడు రాష్ట్రానికి అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. ప‌వ‌న్ స్థాయిని ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు అని, ప‌వ‌న్ లాంటి నిబ‌ద్ధ‌త క‌లిగిన నాయ‌కులు రావాలంటూ ఆకాంక్షించారు. ప‌వ‌న్ మంచి స్థాయికి ఎద‌గాల‌ని ఆశిస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు. తాను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయి సైలెంట్‌గా ఉన్న‌ట్టు తెలిపారు. గాడ్ ఫాద‌ర్ సినిమాలోని డైలాగ్‌లపై కూడా చిరంజీవి స్పందించారు. ప్ర‌స్తుత నాయ‌కుల‌పై ఎలాంటి సెటైర్లు వేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

మాతృక‌లో ఉన్న క‌థ ఆధారంగానే డైలాగ్‌లు రాశామ‌ని, ఈ డైలాగ్‌లు విని ఎవ‌రైనా భుజాలు త‌డుముకుంటే తానేం చేయ‌లేను అన్నారు. తాను పాలిటిక్స్ ఎగ్జిట్ అయి సైలెంట్‌గా ఉన్నాన‌ని చెప్పారు. తాను రాజ‌కీయాల నుంచి బ‌య‌టికి రావ‌డం ప‌వ‌న్‌కి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చిరంజీవి పేర్కొన్నారు. గాడ్‌ఫాద‌ర్ చిత్రం ఓ ర‌కంగా సైలెంట్‌గా ఉన్న చిరు మ‌ళ్లీ పొలిటిక‌ల్‌గా యాక్టివ్ అయ్యేందుకు రూట్ మ్యాపా అన్న‌ట్టు క‌నిపిస్తోంది. చిరంజీవి విడుద‌ల చేసిన డైలాగ్ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. రాజ‌కీయాలు నాకు కొత్త కాదంటూ ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేసిన డైలాగ్‌తో ఒక్కసారిగా మెగా పొలిటిక‌ల్ సంచ‌ల‌నాన్ని క్రియేట్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు