BholaaShankar : ఏడాది తర్వాత మెగాస్టార్ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కి మోక్షం!

BholaaShankar : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “భోళా శంకర్” సినిమా గురించి అంత తేలిగ్గా మెగాభిమానులు మర్చిపోరని చెప్పాలి. చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ హిట్ వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తమన్నా (Tamannah) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా నటించింది. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా మెగా అభిమానులు చాలామంది రీమేక్ సినిమాలు ఎందుకు చేస్తున్నారు, పైగా మెహర్ రమేష్ (Mehar ramesh) కి ఛాన్స్ ఇవ్వడమేంటి అని ఫీల్ అయ్యారు. ఇలా మెగా ఫ్యాన్స్ కి కూడా కిక్కివ్వని కాంబోలో సినిమా తెరకెక్కగా, లాస్ట్ ఇయర్ ఆగష్టు లో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ అయింది.

Chiranjeevi Starrer BholaaShankar Television Streaming Update

ఏడాది తర్వాత భోళాశంకర్ టెలివిజన్ ప్రీమియర్..

ఇక చిరంజీవి (Chiranjeevi) నటించిన భోళా శంకర్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలవగా, ఈ సినిమాని రెండో సారి చూడడానికి మెగా ఫ్యాన్స్ సైతం ఆసక్తి చూపించలేదు. అందుకే ఓటిటి లో కూడా అంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఇక ఈ సినిమా ఇప్పటివరకు టెలివిజన్ స్ట్రీమింగ్ కాకపోవడం గమనార్హం. ప్రముఖ ఛానెల్ జీ తెలుగు వారు (Zee Telugu) భోళా శంకర్ టెలివిజన్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకోగా, సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పటివరకు టివిలో ప్రసారం కాలేదు. అయితే ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయిన ఏడాది తర్వాత టెలివిజన్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది ఈ సినిమా. భోళా శంకర్ (BholaaShankar) సినిమా వచ్చే ఆదివారం అనగా, సెప్టెంబర్ 15న మధ్యాహ్నం 2:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

- Advertisement -

విశ్వంభరతో చిరు బిజీ…

అయితే భోళా శంకర్ ఇప్పుడు టెలివిజన్ లో రిలీజ్ చేసినంత మాత్రాన రెస్పాన్స్ వస్తుందని చెప్పలేము. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విశ్వంభర (Vsihwambhara) లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా, దసరాకి టీజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక విశ్వంభర రిలీజ్ అయ్యాకే చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు