Chiranjeevi : చిరు పక్కదారి పట్టారు… మెగాస్టార్ పై ఫస్ట్ టైం అలాంటి కామెంట్స్ చేసిన కాంగ్రెస్ లీడర్

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పై తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన గతంలో నటించిన ఓ సినిమాను తెరపైకి తీసుకొస్తూ, చిరు పక్కదారి పట్టారంటూ కామెంట్ చేశారు.

అసలు వివాదం ఏంటంటే…

టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా చిరంజీవినీ రాజకీయాల్లోకి లాగుతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన రైతుల సమస్యలపై ఖైదీ నెంబర్ 150 అనే సినిమాను తీశారని, ఆ సినిమా ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన చిరు ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తున్నప్పుడు మాత్రం ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదని ఈ సందర్భంగా జగ్గారెడ్డి ప్రశ్నించారు. రైతుల పేరుతో సినిమాలు తీస్తూ రైతులనే ఇబ్బంది పెడుతున్న మోడీకి సపోర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. చిరు ఎందుకు ప్రధాని మోడీకి పవన్ కు సపోర్ట్ చేస్తున్నాడు? రైతుల తరఫున మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి ఎందుకు అండగా నిలబడటం లేదని తాజా ప్రెస్ మీట్ లో జగ్గా రెడ్డి చిరుని విమర్శించారు. ఒకవేళ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే సరిగ్గా ఉండేవారని, కానీ ఇప్పుడు పక్కదారి పట్టారు అంటూ చిరుపై ఫస్ట్ టైమ్ ఇలాంటి కామెంట్స్ చేశారు.

2008 ఆగస్టు 26న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత పలు నాటకీయ పరిణామాల మధ్య ప్రజారాజ్యం పార్టీని 2011 ఆగస్టులో చిరంజీవి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ పార్టీ నుంచి కేంద్రమంత్రిగా కూడా కొన్నాళ్లు చిరు కొనసాగారు. అయితే ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి 2017లో ఖైదీ నెంబర్ 150 మూవీతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. దీంతో చిరుపై జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో నుంచి ఎప్పుడో తప్పుకున్న చిరుని మళ్లీ ఎందుకు లాగుతున్నారు అంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

విశ్వంభర అప్డేట్….

ఇదిలా ఉండగా మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర అనే సోషియా ఫాంటసీ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీకి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా చెన్నై చిన్నది త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ టాకి పార్ట్ పూర్తయిందని, ఇంకా రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఆ మిగిలిన షూటింగ్లో ఒకటి ఇంట్రో సాంగ్ కాగా, మరొకటి ఐటమ్ సాంగ్, ఇంకా క్లైమాక్స్ ఫైట్ కూడా బ్యాలెన్స్ ఉన్నట్టుగా సమాచారం. మరోవైపు మేకర్స్ ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో త్రిష తో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్, విక్రమ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు