Chiranjeevi: విడుదలకు నోచుకోని మెగాస్టార్ మూవీ.. ఏమైందంటే..?

Chiranjeevi.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ లోకి ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి నేడు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మెగాస్టార్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన కుటుంబం నుంచి పదుల సంఖ్యలో హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి ఆదర్శం అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. ఇప్పటి వరకు తన సుదీర్ఘ ప్రయాణంలో 150 కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందులో కొన్ని సినిమాలు విజయం అందుకుంటే , మరికొన్ని డిజాస్టర్ గా నిలిచాయి. అయినా సరే ఆయన ఏ రోజు ఎప్పుడు ఓడిపోలేదు.

Chiranjeevi: Unreleased Megastar Movie.. What Happened?
Chiranjeevi: Unreleased Megastar Movie.. What Happened?

షూటింగ్ కంప్లీట్ అయి , విడుదలకు నోచుకోని చిరు మూవీ..

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశం కోసం విలన్ గా కూడా నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత తనలోని నటనను గుర్తించిన దర్శకులు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. అలా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సుప్రీం హీరో గా మారి , ఆ తర్వాత మెగాస్టార్ గా మారిపోయారు. ఆరు పదుల వయసు దాటినా సరే ఇప్పటికీ అదే ట్యాగ్ తో ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు చిరంజీవి. ఇకపోతే ఎన్నో చిత్రాలలో నటించిన ఈయన కెరియర్ లో కూడా ఒక సినిమా షూటింగ్ పూర్తయి ఇప్పటికి రిలీజ్ కి నోచుకోలేదు అంటే ఎవరైనా నమ్ముతారా..? అవును నిజమే.. ఆ సినిమా పేరు శాంతి నివాసం.

అతడి మరణమే సినిమా విడుదలకు నోచుకోలేదు..

ప్రముఖ హీరోయిన్ మాధవి(Madavi), చిరంజీవి(Chiranjeevi) జంటగా నటించిన చిత్రం ఇది. ఈ సినిమాకి బాబు దర్శకత్వం వహించారు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. అయితే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఆగిపోయింది. దీనికి కారణం సినిమా విడుదల చేయడానికి డబ్బులు లేకపోవడం కాదు ఆ సినిమాని నిర్మించిన నిర్మాత విడుదలకు కొద్ది నెలల ముందు మరణించడమే.. సినిమా రిలీజ్ నోచుకోకపోవడానికి కారణం అయ్యింది. నిర్మాత మరణం తర్వాత విడుదల అవుతుందని ప్రేక్షకులు ఎదురుచూశారు. కానీ ఇప్పటికీ కూడా ఆ సినిమా రిలీజ్ చేయడానికి ఎవరు ఆసక్తి చూపలేదు. దాంతో చిరంజీవి కెరీర్ లో షూటింగ్ పూర్తయి రిలీజ్ కి నోచుకోని చిత్రంగా శాంతి నివాసం మిగిలిపోయింది. అయితే చిరంజీవికి కూడా ఈ సినిమాను రిలీజ్ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ ఎందుకో దీనిపై మౌనం పాటిస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

చిరంజీవి సినిమాలు..

ఇక చిరంజీవి సినిమా విషయానికి వస్తే, ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10 వ తేదీ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . యూ వీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రం రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాల్లో చెన్నై బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు