Vishwambhara : బెంగుళూరులో మ్యూజిక్ సిట్టింగేసిన మేకర్స్.. విశ్వంభరుడితో పిక్స్ వైరల్..

Vishwambhara : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ కూడా ఒకటి. షూటింగ్ మొదలై ఇప్పటికే ఆరునెలలు కాగా, ఆల్మోస్ట్ షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. రెగ్యులర్ షూటింగ్ ని నాన్ స్టాప్ గా ఫినిష్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు విశ్వంభరని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా విశ్వంభర (Vishwambhara) మేకర్స్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది.

Chiranjeevi Vishwambhara Movie latest update

మ్యూజిక్ సిట్టింగ్ వేసిన మేకర్స్…

ఇక విశ్వంభర సినిమాకు సంబంధించి షూటింగ్ ఆల్మోస్ట్ డెబ్బై శాతానికి పైగా పూర్తి కాగా, ఈ సినిమా మ్యూజిక్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు మేకర్స్. ఎం.ఎం. కీరవాణి విశ్వంభరకు మ్యూజిక్ అందిస్తుండడం వల్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా విశ్వంభర సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ బెంగుళూరుకు వెళ్లడం జరిగింది. అక్కడ ఓ స్టూడియోలో ప్రత్యేకంగా మ్యూజిక్ సెట్టింగ్ వేశారు చిత్ర యూనిట్. ఇక ఈ మ్యూజిక్ సెట్టింగ్ కోసం మెగా స్టార్ సహా, దర్శక నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, అలాగే సింగర్స్ కూడా బెంగుళూరు కి వెళ్లడం జరిగింది. తాజాగా చిత్ర యూనిట్ చిరుతో కలిసి పిక్ షేర్ చేయగా, ఆ పిక్స్ లో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, అరుణ్ కాండిన్య, అలాగే ఫిమేల్ సింగర్లు లిప్సిక తదితరులు ఉన్నారు. ఇక సినిమాకి సంబంధించి కీరవాణి ఇప్పటికే నాలుగు పాటలు సిద్ధం చేయగా, మరో రెండు పాటలు కూడా రెడీ చేస్తున్నారు.

- Advertisement -

సంక్రాంతి టార్గెట్ గా విశ్వంభర..

ఇక విశ్వంభర షూటింగ్ కి సంబంధించి అన్ని పనులు వేగంగా జరుగుతుండగా,మొన్ననే ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టడం జరిగింది. మేకర్స్ కూడా తమా సినిమా జెట్ స్పీడ్ లో కంప్లీట్ అయ్యి సంక్రాంతి కి ఖచ్చితంగా వస్తుందని నమ్మకంగా చెపుతున్నారు. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా వంటి యంగ్ హీరోయిన్లు చిరంజీవి చెల్లెలి పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే హర్ష వర్ధన్, వెన్నెల కిషోర్, రావు రమేష్, కునాల్ కపూర్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరుతో ఓ స్పెషల్ సాంగ్ ని రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారని టాక్. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కాబోతున్న విశ్వంభర నుండి అఫిషియల్ టీజర్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు