Chiranjeevi : బిజినెస్ లో విశ్వంభర విక్టరీ… ఎవరు ఊహించని విధంగా…

Chiranjeevi.. ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏ ఏరియాలో విశ్వంభర థియేట్రికల్ హక్కులను ఎవరెవరు సొంతం చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం.

Chiranjeevi: vishwambhara victory on theatrical business.. no one guess..!
Chiranjeevi: vishwambhara victory on theatrical business.. no one guess..!

విశ్వంభర బిజినెస్ లెక్కలు క్లోజ్..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఆంధ్ర మరియు సీడెడ్ లో బిజినెస్ హక్కులు క్లోజ్ అయినట్లు సమాచారం. ఆంధ్ర లో విశ్వంభర థియేట్రికల్ హక్కులను ధీరజ్ మొగిలినేని సొంతం చేసుకోగా, సీడెడ్ లో శోభన్ మరియు రాయుడు రెండు డిస్ట్రిక్ట్ లను ఒక్కొక్కరుగా సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఓవర్సీస్ విషయానికి వస్తే.. సరిగమ తేజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఓవర్సీస్ హక్కులను రూ .18 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అంతేకాదు బెంగళూరులో కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లు సమాచారం. ఒక పేరు మోసిన డిస్ట్రిబ్యూటర్ సంస్థ విశ్వంభర సినిమా హక్కులను దక్కించుకుందట.

వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్..

ఇకపోతే జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఇంత త్వరగా బిజినెస్ హక్కులు క్లోజ్ అవ్వడం సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తుందని చెప్పాలి. ఏది ఏమైనా అప్పుడే విశ్వంభర థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేస్తుండడంతో అభిమానులు కూడా సినిమాపై ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా చిరంజీవి క్రేజ్ మేనియా మరొకసారి పని చేసిందని వార్తలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

విశ్వంభర తారాగణం..

ఇక చిరంజీవి తాజాగా నటిస్తున్న విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. సోషియో ఫాంటసీ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రాన్ని యు వి క్రియేషన్స్ పతాకంపై వి. వంశీకృష్ణారెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి అలాగే విక్రం రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నట్లు సమాచారం. అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు సంపాదకుడిగా వ్యవహరిస్తూ ఉండగా.. చిరంజీవి, కీరవాణి కలసి పనిచేస్తున్న నాలుగవ చిత్రం కావడం గమనార్హం. ఇక ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక సురభి, హర్షవర్ధన్, ప్రవీణ్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

విశ్వంభర చిత్ర నిర్మాణం..

ఇకపోతే ఈ సినిమా నిర్మాణం విషయానికి వస్తే, 2023 అక్టోబర్ 23న హైదరాబాదులో ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో 13 విభిన్నమైన సెట్లు వేసి సినిమాను చిత్రీకరించారు 1990లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి తరువాయి భాగం అంటూ పుకార్లు కూడా వైరల్ అయ్యాయి. కానీ వశిష్ట మాత్రం విశ్వంభర, జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాకి ఏ మాత్రం సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చారు ఇటీవలే నల్గొండలో ఈ సినిమా షూటింగ్ జరగగా, ఇప్పుడు మళ్లీ హైదరాబాద్లో పునః ప్రారంభించినట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు