Waltair Veerayya : బాస్ వస్తుండు..

మెగాస్టార్ చిరంజీవి.. ఈయన డైలాగ్ చెప్పినా, మాస్ సాంగ్స్ కి స్టెప్పులు వేసినా రెండు తెలుగు రాష్ట్రాలు ఊగిపోతాయి. అయితే ఈ అగ్ర హీరో నుంచి అప్పుడప్పుడు పవర్ ఫుల్ డైలాగ్స్ వస్తున్నాయి. కానీ మాస్ సాంగ్స్ తో కూడిన ఊర మాస్ స్టెప్పులు మాత్రం రావడం లేదు. చిరంజీవి కమ్ బ్యాక్ గా వచ్చిన ఖైదీ నెంబర్ 150 లో ఇలాంటి స్టెప్పులు కనిపించాయి. కానీ దీని తర్వాత వచ్చిన ఆచార్య, గాడ్ ఫాదర్ లో కనిపించలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ అసంతృప్తిలో ఉన్నారు.

ఈ లోటు రాబోయే వాల్తేరు వీరయ్యతో తీరుతుందని మెగాస్టార్ పలు సందర్భాల్లో చెప్పాడు. తాజాగా ఈ రోజు బాస్ పార్టీ అంటూ.. ఒక సాంగ్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ను చూస్తే.. చిరు చెప్పిన ఫ్యాన్స్ లో ఈ లోటు తీరుతుందని అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఫుల్ మాస్ లుక్ తో రచ్చ చేయబోతున్నాడని తెలుస్తోంది. నోట్లో బీడీ, గల్ల లుంగీ, మెరుపుల చొక్కతో మెగాస్టార్ లుక్ పునకాలను తెప్పిస్తోంది. గ్లింప్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ బాస్ పార్టీకి రెడీ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

కాగా ఈ మాస్ సాంగ్ కు దేవి శ్రీ ప్రసాద్ లిరిక్స్ అందిస్తున్నాడు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ తో పాటు నకాష్ అజీజ్, హరిప్రియ బాస్ పార్టీ పాటను పాడారు. ఫుల్ సాంగ్ ను బుధవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి భారీగా హైప్ క్రియేట్ అవుతూ వచ్చింది. ఇటీవల టైటిల్స్ గ్లింప్స్ విడుదల తర్వాత మరిన్నీ అంచనాలు పెరిగాయి. ఇప్పుడు రాబోయే మాస్ బాస్ పార్టీ సాంగ్ మరింత అంచనాలకు ఊతం ఇచ్చేలా ఉంటుందని చెప్పొచ్చు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు