Chiranjeevi: విశ్వంభర సినిమా తర్వాత చిరంజీవి పరిస్థితి ఏంటి.?

Chiranjeevi: గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని శాసిస్తున్న హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. అయితే దాదాపు తన కెరియర్లో 150 సినిమాలు కు పైగా పూర్తి చేశారు మెగాస్టార్ చిరంజీవి. కొన్నేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కం బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా మెగాస్టార్ కి అదే ఆదరణ లభించింది. సినిమాలకు కొన్నేళ్లు పాటు గ్యాప్ ఇచ్చినా కూడా తన ఇమేజ్ మాత్రం చెక్కుచెదరలేదు అని చెప్పొచ్చు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా రెస్పాన్స్ సాధించింది.

సైరా సినిమాతో పాన్ ఇండియా రేంజ్

బాహుబలి సినిమా తర్వాత చాలా తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తాను చూపించడానికి ప్రయత్నం చేసాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే అనుకున్న విధంగా విజయం సాధించాయి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కూడా సైరా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించడానికి ప్రయత్నం చేశారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు కూడా నటించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో ఆడలేదు.

Megastar Chiranjeevi Waltair Veerayya

- Advertisement -

రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత రీమేక్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళంలో హిట్ అయిన వేదాళం అనే సినిమాను మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ గా నటించారు. అలానే లూసిఫర్ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ గా నటించారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా అంతంత మాత్రమే ఆడాయి. ఇకపోతే బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. చాలామంది మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.

మెగాస్టార్ నెక్స్ట్ చేయబోయేది

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా సోసియో ఫాంటసీ జాన్రాలో తెరకెక్కుతుంది. ఈ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి రేంజ్ లో ఉండబోతుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ సినిమాపై కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. వశిష్ట ఇంతకుముందు చేసిన బింబిసారా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈ సినిమాపై కూడా మంచి నమ్మకంతో ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మోహన్ రాజ తో మరోసారి సినిమా చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అలానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయనున్నారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరిలో మెగాస్టార్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అనేది ఇంకొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు