Suma : ‘చిరు’వీణ స్టెప్ తో అదరగొడదామనుకున్న సుమ.. కానీ వీడియో చూస్తే..!

Suma : టాలీవుడ్ మూవీ లవర్స్ ప్రస్తుతం ఇంద్ర రీ రిలీజ్ కోసమే ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ వారం రిలీజ్ అయిన అన్ని సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో మూవీ లవర్స్ ఆకలిమీదున్నారు. పైగా వచ్చేవారం కూడా పెద్దగా సినిమాలు రిలీజ్ అవడం లేదు. ఈ క్రమంలో భారీ అంచనాలతో మెగాస్టార్ చిరంజీవి సినీ అభిమానుల కోసం భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. ఆగష్టు 22న చిరంజీవి (Chiranjeevi) బర్త్ డే స్పెషల్ గా రీ రిలీజ్ అవుతున్న ఇంద్ర సినిమా కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. అలాగే సినీ సెలెబ్రిటీలు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంద్ర సినిమాలో ఐకానిక్ వీణ స్టెప్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇంద్ర రీ రిలీజ్ సందర్బంగా చిరు వీణ స్టెప్ ని ఎంతో మంది మళ్ళీ రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Chiranjeevi's iconic veena step dance by Suma video viral

చిరు వీణ స్టెప్ ని వేసిన సుమ.. కానీ

ఇక రీ రిలీజ్ అవుతున్న ఇంద్ర (Indra) సినిమాలో చిరంజీవి వీణ స్టెప్ కి డాన్స్ చేస్తూ, రీల్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక ఈ వీడియో రీల్స్ ని ఇంద్ర మేకర్స్ వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టగా ఆ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే యాంకర్ సుమ (Suma) కూడా చిరంజీవి వీణ స్టెప్ ని వేసింది. తనతో పాటు తన ఆఫీస్ బాయ్స్ తో కలిసి వీణ స్టెప్ వేయగా, స్టెప్ అయితే వేసింది గాని, మూమెంట్స్ కి విరగబడి నవ్వేలా ఉన్నాయి. నిజంగా కామెడీగానే ఈ వీడియో చేయగా, తన పక్కనున్న బాయ్స్ కూడా ఒక్కొక్కరూ ఒక్కోలా చేశారు. సుమని చూస్తుంటే అందరూ నాకన్నా బాగానే చేసారు కదరా.. అని మనసులో అనుకుంటున్నట్టుంది. ఇక వీడియో కింద అన్ “ప్రొఫెషనల్ డాన్సర్స్” అంటూ ట్యాగ్ చేసి తన ఇంస్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)

- Advertisement -

రీ రిలీజ్ బుకింగ్స్ లో జోరు..

ఇప్పటికే ఇంద్ర సినిమా రీ రిలీజ్ లో అదిరిపోయే బుకింగ్స్ తో అదరగొడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోనే ఏకంగా కోటి రూపాయల మార్క్ ని దాటిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2 కోట్ల మార్క్ కి చేరువైంది. ఇక రీ రిలీజ్ లో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయో లేదో తెలీదు గాని, రీ రిలీజ్ లో జాతర మాత్రం ఖాయమని చెప్పొచ్చు. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరలో నటిస్తుండగా, చిరు బర్త్ డే రోజున టీజర్ రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు