Chiranjeevi : మోదీ గారు అలా అనడం ఎంతో సంతోషాన్నిచ్చింది – చిరంజీవి

Chiranjeevi : ప్రస్తుతం మెగాభిమానులంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. చాలా రోజుల తర్వాత మెగా అన్నదమ్ములు ఒకే చోట రెగ్యులర్ గా కనిపిస్తూ ఉండడంతో మెగాభిమానులు ఉబ్బితబ్బిబైపోతున్నారు. కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీ లో పలు శుభ పరిణామాలు జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ లో క్లింకార పుట్టిన తర్వాత వాళ్ళకి అన్నీ కలిసొస్తున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇక తాజాగా నిన్న (జూన్ 12) ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్బంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సెలెబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి , సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ప్రమాణస్వీకార వేడుకకి హాజరవడం జరిగింది. ఇక పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గెలిచాక చిరంజీవి స్పెషల్ గా మెగా పార్టీ నిర్వహించి తన తమ్ముడిని ఆశీర్వదించి, గుండెలకు హత్తుకోవడం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది.

Chiranjeevi's interesting comments on Narendra Modi

మోదీ అలా అనడం సంతోషాన్నిచ్చిచ్చింది – చిరంజీవి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసారు. ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు అయ్యారు. ఈ వేడుక లో ప్రధాని మోడీ, మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ లతో ఎంతో సన్నిహితంగా ఉన్నారు. ఈ విషయం పట్ల మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. చిరంజీవి ఆ పోస్ట్ లో మోదీ గురించి ప్రస్తావిస్తూ… “ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ, నాతోనూ ఈ రోజు వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు.. ‘ఎలక్షన్ ఫలితాల తరువాత అద్భుత విజయం సాధించి మొట్ట మొదటి సారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసారనీ, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య వున్న ప్రేమానుబంధాలని పంచుకున్న ఆ దృశ్యాలు, మన సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శం గా నిలుస్తాయి’ అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశిత దృష్టికి, నా కృతజ్ఞతలు. తమ్ముడి స్వాగతోత్సవం లాగే ఆయనతో ఈనాటి మా సంభాషణ కూడా కలకాలం గుర్తు ఉండిపోయే ఓ అపురూప జ్ఞాపకం” అని చిరంజీవి పేర్కొన్నారు.

- Advertisement -

మెగా ఫ్యామిలీ సంబరాలు…

ఇక పవన్ కళ్యాణ్ గెలిచాక మెగా ఫ్యామిలీ నుండి ఒక్కొక్కరూ ఒక్కోలా పవన్ ని విష్ చేయడం జరిగింది. చిరంజీవి (Chiranjeevi) స్పెషల్ గా ఇంటి దగ్గర విష్ చేయగా, రామ్ చరణ్ సహా అందరూ ఒకే చోట పవన్ ని విష్ చేయడం జరిగింది. ఇక ఉపాసన కొణిదెల కూడా పవన్ ని ఇంస్టాగ్రామ్ లో ప్రత్యేకంగా విష్ చేయగా, సాయి ధరమ్ తేజ్ షూటింగ్ లు కూడా చేయకుండా కొన్ని రోజులుగా పవన్ నామస్మరణ చేస్తున్నాడు. అయితే అల్లు వారి ఫ్యామిలీ మాత్రం దీనికి కాస్త దూరంగానే ఉన్నారు. కారణాలేవైనా ఫ్యాన్స్ మధ్య ఇది చిచ్చు రేగడానికి కారణం కావచ్చు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ మధ్యలోనే పవన్ కోసం రాగా, తిరిగి ఈరోజు మళ్ళీ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు