Vishwambhara: చిరు సర్ప్రైజ్.. షాక్ లో త్రిష..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఫాంటసీ కథాంశం గా తెరకెక్కిస్తున్నారు.. ఇందులో హీరోయిన్ గా త్రిష ని ఎంపిక చేశారు.. త్రిషకు తెలుగులో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ చిరంజీవితో కలిసి నటిస్తున్న చిత్రం ఇదే .. విశ్వంభర సినిమా లో త్రిష ఎంపికైనప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలను షేర్ చేస్తూనే ఉంది.. ఈ సినిమాలో త్రిష ద్విపాత్రాభినయం చేస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇదంతా పక్కన పెడితే త్రిష ఇప్పుడు మరొకసారి ఒక ఆసక్తికరమైన పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట్ అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

చిరు ఇచ్చిన బహుమతి..
గత కొద్దిరోజుల నుంచి విశ్వంభర సినిమా షూటింగ్లో పాల్గొన్న త్రిష.. చిరంజీవి నుంచి ఒక బహుమానం అందుకున్నది.. ఈ విషయాన్ని త్రిషనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. చిరు సార్ తనకు టెంపరేచర్ కంట్రోల్ మగ్ ని బహుమతిగా ఇచ్చారంటూ వెల్లడించింది.. అలా చిరంజీవి ఇచ్చిన ఒక ఫ్యాన్సీ మగ్ ను సైతం త్రిష సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. క్యాప్షన్ లో కృతజ్ఞతలు కూడా తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి.. తనతో నటించే నటీనటులకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి బహుమతులు ఇస్తూ సడన్ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు.. ఇలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లను, నటీనటులను కూడా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఈసారి త్రిష వంతు వచ్చింది..

విశ్వంభర మూవీ విశేషాలు..
ప్రస్తుతం విశ్వంభర సినిమా విషయానికి వస్తే..UV క్రియేషన్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.చాలాకాలం తర్వాత చిరంజీవి నటించబోతున్న సోషియో ఫాంటసీ సినిమా కావడం చేత అభిమానులు ఈ చిత్రం పైన భారీగా అంచనాలను పెట్టుకున్నారు.. విశ్వంభర చిత్రంలో చిరంజీవికి ఐదు మంది చెల్లెలు ఉంటారని.. అందుకోసం కొంతమంది యంగ్ హీరోయిన్లను కూడా ఎంపిక చేసినట్లు సమాచారం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు గత కొద్ది రోజుల క్రితమే అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది.. అందుకే ఈ సినిమా షూటింగును సైతం శరవేగంగా పూర్తి చేస్తోంది చిత్ర బృందం.

- Advertisement -

చిరంజీవి సినిమాలు..
చివరిగా చిరంజీవి నటించిన సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తమన్నా హీరోయిన్గా.. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో భోళా శంకర్ సినిమా విడుదల కాగా ఘోరమైన డిజాస్టర్ గా మూటకట్టుకుంది.. అందుకే చిరంజీవి కథల ఎంపిక విజయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఇలా యంగ్ డైరెక్టర్ వశిష్టకు అవకాశం ఇచ్చారు.. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.. మొత్తానికైతే ఇప్పుడు చిరంజీవి త్రిషకి ఇచ్చిన బహుమతి ఆమెనే కాదు అందరిని ఆశ్చర్యపరుస్తుందని చెప్పవచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు