Chiranjeevi : భోళా శంకర్ విషయంలో మళ్ళీ అదే తప్పు చేస్తున్న చిరు..!

చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ఆచార్య పెద్ద ఫ్లాప్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివతో చేసిన సినిమానే అయినప్పటికీ సినిమా ఫ్లాప్ అయ్యింది. కంటెంట్ వీక్ గా ఉందని స్పష్టంగా అందరికీ అర్థమైంది. మరోపక్క ఇది కొరటాల శివ తీసిన గత సినిమాల స్థాయిలో పది శాతం కూడా లేదు.ఏదిఏమైనా పెద్ద డైరెక్టర్ తో చేసినా సినిమా ఫ్లాప్ అయ్యింది అనే బాధలో చిరు ఉన్నారు. దాంతో మెహర్ రమేశ్ తో తెరకెక్కిస్తున్న భోళా శంకర్ చిత్రంలో చాలా మార్పులు కోరుతున్నారట చిరు. దీంతో రైటర్స్ తో కూర్చొని దర్శకుడు మెహర్ రమేష్ మళ్ళీ మార్పులు చేయడం మొదలుపెట్టాడు.

మెహర్ రమేష్ ఏమాత్రం ఫాంలో ఉన్న దర్శకుడు కాదు అయినా చిరు పిలిచి అవకాశం ఇచ్చారు.అయితే చిరు ఇంకో విషయం గమనించాలి.అదేంటి అంటే ఆచార్య లో ఆయన చెయ్యి పెట్టడం వల్లనే సినిమా ఫలితం తేడా కొట్టింది. మరి భోళా శంకర్ ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం కి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు