Chiru Vs Charan: సంక్రాంతి పోరులో నెగ్గేదెవరు..?

Chiru Vs Charan.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎవరి సహాయం లేకుండా అడుగుపెట్టి తన స్వయంకృషితో నేడు మెగాస్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు చిరంజీవి.. ఇప్పుడు ఈయన పేరును ఉపయోగించుకొని చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏకంగా వరల్డ్ స్థాయిలోనే పాపులారిటీ సొంతం చేసుకొని.. తండ్రి కంటే ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.. ఇదిలా ఉండగా కొడుకు సాధిస్తున్న విజయాలను చూసి తండ్రి మురిసిపోతుంటే.. తండ్రి సాధిస్తున్న అవార్డులను చూసి కొడుకు ఉప్పొంగిపోతున్నారు. ఇలాంటి తరుణంలో వీరిద్దరి మధ్య పోటీ అభిమానులలో ఆందోళనలను కలిగిస్తోంది.
సాధారణంగా ఎవరికి వారు సినిమాలను విడుదల చేసేవారు.. కానీ ఈసారి అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్ సంక్రాంతి బరిలో వీరిద్దరూ పోటీకి దిగబోతుండడంతో మెగా అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు..

విశ్వంభరాతో పోటీకి సిద్ధం..

Chiru Vs Charan: Who will win the Sankranti battle..?
Chiru Vs Charan: Who will win the Sankranti battle..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసారా సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాను 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తామని చిత్ర బృందం కూడా ప్రకటించింది. ఇక ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఇదిలా ఉండగా గతేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసిన వాల్తేరు వీరయ్య సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అందుకుంది.. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చే యేడాది కూడా సంక్రాంతికి తన సినిమాను విడుదల చేయాలని చిరంజీవి సిద్ధమయ్యారు..

గేమ్ ఛేంజర్ తో బరిలోకి చరణ్..

ఇదిలా ఉండగా మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.. ఈ సినిమాపై కూడా అంచనాలు ఇప్పుడు భారీ స్థాయిలో పెరిగిపోయాయి.. శంకర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ఇప్పటినుంచే చెప్పేస్తున్నారు.. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది.. ఇప్పుడు అక్టోబర్ లేదా నవంబర్లో విడుదల కావాల్సి ఉండగా.. మరోవైపు ఈ సినిమాని ఫినిష్ చేయకుండా డైరెక్టర్ శంకర్ కమలహాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ సినిమా విడుదలను బట్టి గేమ్ ఛేంజర్ సినిమా విడుదల తేదీ ఆధారపడి ఉంది.. అయితే ఇండియన్ 2 సినిమా ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఒకవేళ ఇదే జరిగితే గేమ్ ఛేంజర్ సినిమా కూడా వాయిదా పడుతుంది. ఇక నవంబర్ దాటిందంటే ఈ సినిమా కచ్చితంగా సంక్రాంతి సీజన్ కి మాత్రమే విడుదలవుతుందని చెప్పడంలో సందేహం లేదు.

- Advertisement -

తండ్రీకొడుకుల మధ్య పోటీ..

ఇకపోతే ఇప్పటికే చిరంజీవి సంక్రాంతికి విశ్వంభర సినిమాతో వస్తున్నామని చెప్పేశారు. కాబట్టి ఈ సినిమాకి పోటీగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఒకవేళ ఇదే జరిగితే తండ్రి కొడుకుల మధ్య వార్ ఏ స్థాయిలో ఉంటుందో అని మెగా అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతే కాదు వీరికి పోటీగా ప్రభాస్ కూడా రాబోతున్నారు. మారుతీ దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఒకవేళ ఇదే నిజమైతే మరి ఈ ముగ్గురి మధ్య పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం అసాధ్యం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు