Thangalaan : తంగలాన్ సెన్సార్ పూర్తి.. ఈ దారుణమైన సీన్స్ ఉన్నా…

Thangalaan : చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 15న రిలీజ్ కి రెడీ అవుతుంది. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, పలు పోస్టర్లు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే షూటింగ్ పూర్తయి చాలా రోజులయినా పలు కారణాల వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడుతూ నెలల తరబడి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మెయిన్ గా విక్రమ్ ఇంజ్యూరీ వల్ల సినిమా చాలా రోజులు షూటింగ్ ఆగిన సంగతి తెలిసిందే. ఇక చిత్ర యూనిట్ ప్రమోషన్లలో బిజీగా ఉండగా, తాజాగా తంగలాన్ చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

Chiyaan Vikram's Thangalaan movie Got U/A certificate

తంగలాన్ సెన్సార్ పూర్తి.. అలాంటి సీన్స్ ఉన్నా..

ఇక తాజాగా తంగలాన్ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. అయితే సినిమాకే సెన్సార్ వారు UA సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ సర్టిఫికెట్ వస్తుందని అనుకోలేదు చాలామంది. ఎందుకంటే తంగలాన్ సినిమాలో ట్రైలర్ లో ఉన్న వీడియో కంటెంట్ ని బట్టి చాలా మంది నెటిజన్లు సినిమాలో ఎక్కువగా హింసాత్మక సీన్లు, వైలెన్స్ ఎక్కువగా ఉంటాయని భావించారు. అందువల్ల సినిమాకి A సర్టిఫికెట్ వస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా కి సెన్సార్ బోర్డ్‌ నుంచి ఒక్క కట్స్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ని ఇవ్వడం జరిగింది. అయితే అందిన సమాచారం ప్రకారం సినిమాలో కొన్ని డైలాగ్స్ ను మ్యూట్‌ చేయగా, మరి కొన్ని హింసాత్మక షాట్స్ ని బ్లర్ చేయించారట.

- Advertisement -

స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న తంగలాన్…

ఇక తంగలాన్ చిత్ర ప్రమోషన్లలో చిత్ర యూనిట్ ఇప్పటికే బిజీగా ఉన్నారు. అయితే తెలుగులో మాత్రం ఇంకా ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు. ఇక తంగలాన్ సినిమా గ్రామీణ ప్రాంతంలో జరిగే ఓ హారర్‌ యాక్షన్ థ్రిల్లర్ కథతో సినిమా సాగుతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. పైగా పీరియాడిక్ డ్రామా కాబట్టి సినిమాపై భారీ అంచనాలున్నాయి. విక్రమ్‌ ఈ సినిమాతో భారీ కం బ్యాక్ ఇస్తాడని అంటున్నారు నెటిజన్లు. ఇక మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతకంపై జ్ఞానవేల్‌ నిర్మించగా, జీవీ ప్రకాష్‌ కుమార్‌ మ్యూజిక్ ఇచ్చాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు