Thangalaan : తంగలాన్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్.. చియాన్ స్థాయి ఇది కాదు..

Thangalaan : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా ఫైనల్ గా రేపు ఆగష్టు 15న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ పా.రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ హారర్ యాక్షన్ డ్రామాలో మాళవిక మోహనన్, పార్వతి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ తంగలాన్ ఫైనల్ గా పంద్రాగస్టున రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులని ఆకట్టుకుని సినిమా కోసం ఆతృతగా ఎదుచూసేలా చేసాయి. ఇటు చిత్ర యూనిట్ కూడా వరుస ప్రమోషన్లతో సినిమాపై పెంచేశారు. తంగలాన్ లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా తంగలాన్ సినిమాకి సంబంధించి ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

Chiyan Vikram Thangalaan Movie Business and Break Even Target Details

విక్రమ్ స్థాయి కంటే తక్కువే..

ఇక తాజాగా తంగలాన్ సినిమా థియేట్రికల్ బిజినెస్ కి సంబంధించి వివరాలు రాగా, ఏరియా వారీగా డీటెయిల్స్ తెలియలేదు గాని, తెలుగు రాష్ట్రాల్లో అయితే తంగలాన్ కి 6 కోట్ల బిజినెస్ జరిగింది. ఆగష్టు 15న విడుదల అవుతున్న సినిమాల పోటీ దృష్ట్యా, కాస్త తక్కువ బిజినెస్ జరిగిందని చెప్పాలి. అంటే తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాలంటే 6.50 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇక తమిళనాడులో 35 కోట్లు, ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ సహా మరో 23 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా తంగలాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ 65 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. నిజానికి విక్రమ్ (Chiyaan Vikram) స్థాయికి తగ్గ బిజినెస్ ఇది కాదని చెప్పాలి. కానీ ఆగష్టు 15న విడుదల అవుతున్న సినిమాల పోటీ వల్ల ఈ సినిమా బిజినెస్ కాస్త తగ్గిందని చెప్పాలి.

- Advertisement -

సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడా?

ఇక విక్రమ్ లాస్ట్ ఇయర్ పొన్నియిన్ సెల్వన్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోగా, ఈ సినిమాతో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలనీ చూస్తున్నాడు. ఇక తంగలాన్ కి జరిగిన బిజినెస్ ని బట్టి సినిమా హిట్ అవ్వాలంటే 130 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు అందుకోవాలి. సినిమాకి మంచి టాక్ వస్తే ఈ వసూళ్లు అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు. తెలుగు లో భారీగా పోటీ ఉన్నా కూడా, తంగలాన్ పై కూడా మంచి అంచనాలే ఉండగా, బిజినెస్ ని బట్టి ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువే. ఇక తమిళనాట భారీ ఎత్తున సినిమా రిలీజ్ కానుండగా, తంగలాన్ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు