Cinima Industry : పుట్టుకతో ముస్లింలు… కానీ హిందూ మతాన్ని ఆచరిస్తున్న స్టార్స్ వీళ్లే

Cinima Industry : భారతదేశం సర్వమత సమ్మేళనం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ హిందూ మతానికి ఉన్న ప్రాధాన్యత మరే ఇతర దేశాల్లోనూ ఉండదు. ఇక ప్రపంచంలోని అత్యంత ప్రాచీన మతాలలో హిందూ మతం ఒకటి. అందుకే భారతదేశాన్ని హిందుస్థాన్ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హిందూ మతం ద్వారా ప్రభావితం అయ్యి, దానికి తగ్గట్టుగా తమ ఆలోచనలను మార్చుకొని మన సంస్కృతికి అలవాటు పడ్డారు, ఇప్పటికీ అవలంబిస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలో జరుగుతున్న రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం రామనామ స్మరణలో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలోనే హిందూ మతంలోకి కన్వర్ట్ అయిన సెలబ్రిటీలు ఎవరెవరో తెలుసుకుందాం.

1. నర్గీస్
బాలీవుడ్లో అగ్ర తారగా వెలుగొందిన నర్గీస్ నిజానికి ముస్లిం. ముస్లిం ఫ్యామిలీలో పుట్టిన ఆమె అసలు పేరు ఫాతిమా రషీద్. కానీ ఈమె ఆ తర్వాత తన పేరును సినిమాల కోసం నర్గీస్ అని మార్చుకుంది. ఇక హిందూ మతాన్ని స్వీకరించిన నర్గీస్ సునీల్ దత్ ను వివాహం చేసుకున్నప్పుడు తన పేరును నిర్మలా దత్ గా మార్చుకుంది.

2. ఖుష్బూ
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దశాబ్ద కాలానికి పైగా తన హవా కొనసాగించిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ పుట్టుకతోనే ముసల్మాన్. ఆమె అసలు పేరు నకత్ ఖాన్. సినిమాల్లోకి వచ్చాక తన పేరును మార్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత పూర్తిస్థాయి హిందూ ధర్మాన్ని అలవర్చుకొని, ఇప్పటికీ హిందువుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె బిజెపి పార్టీలో ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

3. జార్జ్ హారిసన్
ప్రపంచంలోని అత్యుత్తమ గిటారిస్ట్ గా పేరు తెచ్చుకున్న జార్జ్ హారిసన్ భారతదేశ పర్యటన సందర్భంగా హిందూ మతంలోకి కన్వర్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన తన జీవితంలో ఎప్పుడూ మాంసాహారాన్ని ముట్టుకోలేదట.

4. నయనతార
సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. ఆమె ఒరిజినల్ పేరు డయానా మరియం కురియన్. సినిమాల కోసం తన పేరును నయనతారగా మార్చుకున్న ఈ బ్యూటీ 2017లో హిందూ మతంలోకి మారింది. దానికోసం ప్రత్యేకంగా చెన్నైలోని ఆర్య సమాజ్ ఆలయంలో పూజలు కూడా చేసింది.

6. జ్యోతిక
తమిళ బ్యూటీ జ్యోతిక తండ్రి పంజాబీ కాగా, తల్లి ముస్లిం. అయితే జ్యోతిక మాత్రం అన్ని మతాలను నమ్ముతుంది. కానీ ఆమె సూర్యను హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవడంతో జ్యోతిక హిందూ మతాన్ని స్వీకరించింది అనే ప్రచారం ఉంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. వీళ్ళతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు హిందూ మతం పట్ల ప్రభావితమై తమ మతాన్ని మార్చుకున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు