Thangalaan Movie: చియాన్ మాటలపై క్లారిటీ వచ్చేసింది

చియాన్ విక్రమ్ అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్న మూవీ తంగలాన్. ఇటీవల విడులైన ఈ మూవీలోని టీజర్ అంచనాలను ఒక్క సారిగా పెంచేసింది. ఒక తమిళంలోనే కాదు, ఇటు సౌత్ మొత్తం, అటు నార్త్ లో కూడా తంగలాన్ మూవీపై బజ్ పెరిగింది. ఇక అదే టైంలో చాలా ప్రశ్నలు కూడా వచ్చాయి.

Malavika Mohanan: సౌత్ ఇండస్ట్రీ హాట్ బ్యూటీ ఏంటి ఇలా మారిపోయింది?

అందులో ప్రధానమైంది… తంగలాన్ సినిమాలో హీరో చియాన్ విక్రమ్ కి డైలాగ్స్ ఉంటాయా? ఈ ప్రశ్న తంగలాన్ కోసం వెయిట్ చేస్తున్న అందరినీ గందరగోళానికి గురి చేసింది. దీనికి కారణం… విక్రమ్ మేనేజర్ సూర్య నారాయణ. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో తంగలాన్ లో విక్రమ్ కి డైలాగ్స్ లేవని ఆయన చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ సినిమా మొత్తంలో విక్రమ్ కు డైలాగ్స్ ఉండవని, శివ పుత్రుడు స్టైల్ లో ఈ సినిమా ఉండబోతుంది అంటూ వైరల్ చేశారు.

- Advertisement -

ఇదే టైంలో… ఒక హీరో పాత్రకు డైలాగ్స్ లేకుంటే ఎలా… అది సినిమాకే నష్టం అంటూ కూడా వాదన కూడా వచ్చింది. ఇలాంటి గందరగోళ పరిస్థితులు రావడంతో చియాన్ విక్రమ్ మేనేజర్ సూర్య నారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

Thangalaan: ఆసక్తికరంగా టీజర్ అప్డేట్ పోస్టర్

తంగలాన్ సినిమా టీజర్ లో మాత్రమే విక్రమ్ కి డైలాగ్స్ లేవని తను చెప్పినట్టు వివరించాడు. దీన్ని తప్పు అర్థం చేసుకుని, సినిమా మొత్తంలో డైలాగ్స్ ఉండవని అనుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. తంగలాన్ సినిమాలో విక్రమ్ మేకోవర్ మాత్రమే కాదు, డైలాగ్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. దీంతో గత కొన్ని రోజుల నుంచి విక్రమ్ డైలాగ్స్ పై జరుగుతున్న రూమర్స్ కు చెక్ పడింది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు