KGFయష్ కొత్త సినిమాపై క్లారిటీ !

KGF సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ,యష్ హీరోగా వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ సినిమా అప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్ని చెరిపేసి కొత్త రికార్డ్స్ కి తెరలేపింది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1200 కోట్ల మార్క్ టచ్ చేసి అందరిని ఆశ్చర్యపడేలా చేసింది.

అయితే KGF సినిమా తరువాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో “సలార్” సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించి షూటింగ్ అయిపొవస్తుంది. రిలీజ్ డేట్ కూడా చాలా రోజుల క్రితమే ఎనౌన్స్ చేసారు. KGFసినిమాని ప్రొడ్యూస్ చేసిన హోంబలే ఫిలిమ్స్ కూడా KGFతరువాత కాంతారా సినిమా రిలీజ్ చేసారు. అయితే హీరో యష్ మాత్రం ఇప్పటి వరికి ఏ సినిమా కమిట్ అవ్వలేదు. KGF తరువాత యష్ చాలా కథలు వింటూనే ఉన్నారు కానీ ఓకే మాత్రం ఎవరికీ చెప్పలేదు. ఇక యష్ సినిమా లేనట్టే KGF-3 దాకా వెయిట్ చెయ్యాల్సిందే అనుకున్నారు అందరు.

యష్ సినిమాకి ఓకే చెప్పడం అంటే ఇప్పుడు మాములు విషయం కాదు. ఎందుకంటే యష్ కి KGFతో గ్లోబల్ రికాగ్నేషన్ వచ్చింది. యష్ సినిమా వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే యష్ ఎవర్ని నిరాశ పరచకూడదు అనే ఉద్దేశ్యంతో కథల విషయంలో చాలా జాగత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే యష్ కి ఈ మధ్యనే ఒక స్క్రిప్ట్ బాగా నచ్చిందట. ఆ సినిమా చేయడానికే యష్ సుముఖంగా ఉన్నారని వార్త వినిపిస్తోంది. కమర్షియల్ సినిమా కాకుండా ఏదైనా కాన్సెప్ట్ బేసెడ్ సినిమా చేయాలనీ ఇన్ని రోజులు ఎదురుచుసిన యష్ కి ఫైనల్లీ ఒక కథ నచ్చింది. సినిమా కూడా ఇవాళ రేపో ఒకే అయ్యేలాగా ఉంది. మరి యష్ కి అంత బాగా నచ్చిన ఆ కథ ఎవరు చెప్పారా.. అనుకుంటున్నారా. గీతూ మోహన్ దాస్ అనే మలయాళ దర్శకురాలు.

- Advertisement -

గీతూ మోహన్ దాస్ మలయాళంలో నవీన్ పౌల్ హీరో గా “ముతోన్” సినిమా కి దర్శకత్వం వహించారు. హై ఎక్సపెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది.అప్పటి వరకి మంచి హిట్స్ తో ఉన్న నవీన్ పౌల్ కి ముతోన్ సినిమా బ్రేక్ వేసింది. అయితే గీతూతో యష్ సినిమా చేస్తున్నాడు అనే న్యూస్ బయటికి రాగానే యష్ కెరీర్ కూడా నవీన్ లాగే అవుతుందేమో అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు