Manchu Manoj: మంచు వారింట మంట

మంచు ఫ్యామిలీ లో అన్నదమ్ముల మధ్య వివాదం నానాటికి ముదురుతోంది. మంచు మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ లు ఇండస్ట్రీ లో తమ గుర్తింపు కోసం ఇప్పటికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీ లో అందరు కాంట్రవర్సీ లకు కేరాఫ్ గా ఉంటారు. వీళ్ళలో మంచు మనోజ్ కు మాత్రం ఇండస్ట్రీ లో సౌమ్యుడు అని కొంచెం మంచి పేరు ఉంది.

అసలు విషయానికి వస్తే మంచు విష్ణు, మనోజ్ లకు ముందు నుంచి అభిప్రాయ భేదాలున్నాయని తెలిసిందే. పైగా మనోజ్ మోహన్ బాబు గారి రెండో భార్య కొడుకు. కాగా రీసెంట్ గా జరిగిన ఇష్యూ తో వీరి మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. ఈ మధ్యనే మంచు మనోజ్ మౌనిక రెడ్డి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్లి వేడుక తర్వాతే మంచు బ్రదర్స్ మధ్య గొడవ తీవ్ర స్థాయిలో ఉందని అందరికీ తెలిసింది. మనోజ్ పెళ్లికి మంచు విష్ణు వెళ్లినా, అంటిముట్టన్నట్టు వ్యవహరించారు.

ఇక తాజాగా మంచు బ్రదర్స్ మధ్య గొడవ దాడుల వరకు, పోలీస్ స్టేషన్ ల వరకు వెళ్లింది. మంచు విష్ణు దాడి చేస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో మనోజ్ దగ్గర పనిచేసే సారథి అనే వ్యక్తిని కొట్టడానికి విష్ణు వెళ్తున్నాడు. ఈ ఘటన సమయంలో మంచు మనోజ్ కూడా ఉన్నాడు. ఈ వీడియోలో.. మా మనుషులపై, బంధువులపై ఇలా దాడి చేస్తున్నాడు. ఇది పరిస్థితి అంటూ మంచు మనోజ్ వాయిస్ కూడా ఉంది.

- Advertisement -

కాగా ఈ దాడిపై విష్ణుపైన మనోజ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధం అయ్యారని సమాచారం. ఇదిలా ఉండగా, మంచు బ్రదర్స్ గొడవపై మోహన్ బాబు చాల సీరియస్ అయ్యారు. అన్నదమ్ములను పిలిపించి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడని టాక్. తండ్రి వార్నింగ్ తో అయినా, మంచు బ్రదర్స్ మారుతారా ? లేదా అనేది చూడాలి మరి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు