Hanu Raghavapudi : మల్టీస్టారర్ లేదా ?

‘సీతారామం’ సినిమా తర్వాత హను రాఘవపూడి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ‘సీతారామం’కి ముందు హను రాఘవపూడి మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేశాడు. కానీ అవి సీతారామం అంత పెద్ద హిట్ కాలేదు. ప్రతి సినిమాలో సెకండ్ హాఫ్ మైనస్ గా ఉండేది. కానీ తనలో ఉన్న లోపాన్ని మార్చుకుని సీతారామం సినిమాలో సెకండ్ హాఫ్ నే హైలైట్ గా తీశాడు. అప్పటి నుంచి హను రాఘవపూడితో సినిమాలు చేయాలని హీరోలు అనుకుంటున్నారు.

ఇటీవల హను రాఘవపూడి తో యంగ్ హీరోలు నేచురల్ స్టార్ నాని, శర్వా నంద్ సినిమా చేస్తున్నారని తెగ వార్తలు వినిపించాయి. ఈ కుర్ర హీరోలతో హను రాఘవపూడి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. నాని, శర్వా నంద్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న హీరోలు. వీరితో మల్టీస్టారర్ అంటే హను రాఘవపూడికి మరో హిట్ పడినట్టే అనుకున్నారు. కానీ మల్టీ స్టారర్ వార్తలను హను రాఘవపూడి సన్నిహితులు ఖండించారు. హను మల్టీస్టారర్ చేయడం లేదని తెల్చిచెప్పారు. అలాగే హను సినిమాలో నాని , శర్వానంద్ లేరని చెబుతున్నారు.

కాగా హను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, శర్వానంద్ ఇప్పటికే నటించారు. కృష్ణ గాడి వీర ప్రేమ కథ‌ తో నానికి హను రాఘవపూడి మంచి హిట్ ఇచ్చారు. అలాగే శర్వానంద్ తో హను పడి పడి లేచే మనసు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కమర్షియల్ గా హిట్ కాలేకపోయింది. కానీ సినీ విశ్లేషకుల నుంచి మంచి రివ్యూలను తెచ్చుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు