Colour Swathi: కలర్ స్వాతిని పిలిచి విక్టరీ వెంకటేష్ అలా మాట్లాడారట

Colour Swathi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లో విక్టరీ వెంకటేష్ ఒకరు. మామూలుగా కొంతమందికి యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు కానీ అంతమంది ఫ్యాన్స్ ఇష్టపడే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు అందులో విక్టరీ వెంకటేష్. చాలామంది వెంకీ మామ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇకపోతే వెంకటేష్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ న్న ఫ్యామిలీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వెంకటేష్ సినిమా వస్తుంది అని అంటే కుటుంబ సమేతంగా థియేటర్ కు వెళ్లేవాళ్లు.

అయితే వెంకటేష్ కెరియర్ లో ఎన్నో రీమేక్ సినిమాలు కూడా చేశారు. ఇకపోతే సెల్వా రాఘవన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సినిమా ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్వ రాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం. యువన శంకర్ రాజా మ్యూజిక్ ఇవన్నీ కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు పాత్రను చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు సెల్వ. ఇకపోతే ఈ సినిమాలో కలర్ స్వాతి కూడా నటించింది.

Adavari Matalaku Ardhale Verule

- Advertisement -

కలర్స్ అనే ప్రోగ్రాం తో మంచి గుర్తింపును సాధించుకుంది స్వాతి. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా ఎన్నో సినిమాలు చేసింది. అయితే వెంకటేష్ నటించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించిన స్వాతి అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను రీసెంట్ గా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ సినిమా చేస్తున్న తరుణంలో వెంకటేష్ గారు స్వాతిని పిలిపించారట. అయితే అప్పటికే స్వాతి బయోటెక్నాలజీ చదువుతుండడంతో విక్టరీ వెంకటేష్ పిల్లలు కూడా అదే కోర్స్ చేయడంతో ఆ కోర్స్ వలన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఎడ్యుకేషన్ గురించి ఫ్యామిలీ గురించి అడిగి తెలుసుకున్నారట. అయితే అంతటి స్టార్ హోదాలో ఉన్న వెంకటేష్ గారు నన్ను పిలిచి మాట్లాడటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పుకొచ్చింది స్వాతి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు