Dhanaraj : ఆ మూవీ వల్ల సర్వం కోల్పోయానన్న ధనరాజ్..!

Dhanaraj : టాలీవుడ్ లో జబర్దస్త్ టెలివిజన్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు తమ టాలెంట్ ని నిరూపించుకుని ఇప్పుడు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్న సంగతి తెలిసిందే. హైపర్ ఆది టాప్ కమెడియన్ గా కొనసాగుతూనే డైలాగ్ రైటర్ గా మంచి పట్టు సాధించాడు. ఇక రీసెంట్ గా కమెడియన్ వేణు బలగం సినిమాతో డైరెక్టర్ గా మారి బ్లాక్ బస్టర్ సాధించి, ఇప్పుడు ఏకంగా నాని తో సినిమా చేయబోతున్నాడు. అలాగే మరో కమెడియన్ ధనరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ, జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ధనరాజ్ కూడా ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణించేందుకు రెడీ అయ్యాడు. లేటెస్ట్ గా ధనరాజ్ నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘రామం రాఘవం’ ఈ సినిమా ప్రమోషన్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలని చెప్పుకొచ్చాడు.

Comedian Dhanaraj said that he lost crores due to that film

ఆ సినిమా వల్ల అన్నీ కోల్పోయా – ధనరాజ్

నటుడు ధనరాజ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూ లో తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. అలాగే ఓ సందర్భంలో తాను కెరీర్ లో అన్నీ కోల్పోయానని అన్నాడు. కమెడియన్ గా పీక్స్ లో ఉన్న టైం లో ధనరాజ్ హీరోగా ఓ సినిమా చేయడం జరిగింది. అందులో శ్రీముఖి హీరోయిన్. ఈ సినిమా పేరు ‘ధనలక్ష్మి తలుపు తడితే’. 2015 లో విడుదలైన ఈ సినిమాకి ఆశించిన ఆదరణ దక్కలేదు. ఈ విషయాన్ని చెప్పుకొస్తూ ధనరాజ్ ఈ సినిమా వల్ల తాను చాలా నష్టపోయానని చెప్పుకొచ్చాడు ధనరాజ్. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయినపుడు మంచి టాక్ వచ్చిందని, టికెట్లు దొరకడంలేదని శ్రీముఖి తనతో ప్రస్తావించిందని, దాంతో సంతోషంగా ఫీల్ అయ్యామని చెప్పుకొచ్చాడు. కాని కట్ చేస్తే.. తమ సినిమా రిలీజ్ అయిన బాహుబలితో థియేటర్లు మొత్తం నిండిపోయాయని అందువల్ల తమ సినిమాని ఎవ్వరూ పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకు తానే నిర్మాతగా ఉన్నానని, అప్పట్లో ఉన్నది కాకుండా, ఫ్రెండ్స్ దగ్గర అప్పు తెచ్చి మరీ నిర్మించానని, థియేటర్లకు జనాలు రాకపోవడంతో ఉన్నది మొత్తం కోల్పోయానని, అప్పులపాలయ్యానని ధనరాజ్ ఆవేదన వ్యక్తం చేసాడు.

- Advertisement -

త్వరలో రామం రాఘవం..

ఇక ధనరాజ్ (Dhanaraj) నటించి దర్శకత్వం వహించిన రామం రాఘవం చిత్రాన్ని జులై లో థియేటర్ల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నామని, పోటీగా కాకుండా సోలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని తెలియచేసాడు. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని రెండో లీడ్ గా నటించగా, ఈ సినిమాలో ధనరాజ్, సముద్రఖని తండ్రి కొడుకులుగా నటించడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మరి ఈ సినిమాతో ధనరాజ్ దర్శకుడిగా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు