Comedian Rajababu: ఆ ఇద్దరే.. ఈయన జీవితాన్ని నాశనం చేశారా..?

Comedian Rajababu.. టాలీవుడ్ సినీ పరిశ్రమకు చిక్కిన అతి కొద్ది మంది ఆణిముత్యాలలో కమెడియన్ రాజబాబు (Comedian Rajababu)కూడా ఒకరు. ఇండస్ట్రీ లోకి రావాలన్న ఆయన తపన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కాదనేలా చేసింది. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన రాజబాబు కమెడియన్ గా స్థిరపడిపోయారు. తనను చూస్తే చాలు మోము పై చిరునవ్వు కనిపిస్తుంది. తన అద్భుతమైన కామెడీతో ,బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ తరం ప్రేక్షకులకు ఈయన గురించి పెద్దగా తెలియదు. కానీ నాటితరం ఆడియన్స్ కి ఈయన ఒక హాస్యబ్రహ్మ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈయన నటించిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు హీరోలతో సమానంగా పారితోషకం తీసుకుంటూ కమెడియన్గా మంచి పాపులర్ సంపాదించుకున్నారు రాజబాబు.

Comedian Rajababu: Did those two.. ruined his life..?
Comedian Rajababu: Did those two.. ruined his life..?

1962 లోనే రూ.800 పారితోషికం.

ముఖ్యంగా ఎన్టీఆర్ (NTR), ఏఎన్నార్ (ANR ), కృష్ణ ( Krishna )లాంటి స్టార్ హీరోలతో ఎక్కువగా కలిసి నటించారు రాజబాబు. ప్రత్యేకించి ఎన్టీఆర్ తో ఈయనకున్న బంధం విడదీయరానిది. వీరిద్దరూ ఎన్నో సినిమాలలో కలిసి నటించారు.. అలాంటి చిత్రాలలో 1962 లో వచ్చిన ఆత్మబంధువు చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పిఎస్ రామకృష్ణారావు(P.S. Ramakrishna Rao)దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేవీ మహదేవన్ (KV.Mahadevan)సంగీతం అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, సావిత్రి (Savitri)జంటగా నటించగా, రాజబాబు మోహన్ పాత్రలో మెప్పించారు. అప్పట్లో రాజబాబుకు ఎనిమిది వందల రూపాయలు పారితోషకంగా ఇచ్చారట నిర్మాత. ఆ కాలంలో ఇది పెద్ద మొత్తం అని చెప్పవచ్చు.

ఆ ఇద్దరి వల్లే మద్యానికి బానిసైన రాజబాబు..

ఈ సినిమా షూటింగ్ సమయంలో హైదరాబాదులో ఆయనకు ఒక చిన్న హోటల్లో ఒక రూమ్ లో బస కల్పించారు . అదే రూమ్ లో మరో ఇద్దరు చిన్న నటులు కూడా ఉండేవారట. ఆ రోజుల్లో చూడడానికి సన్నగా, పీలగా కనిపించేవారు రాజబాబు. అయితే ఆయనను చూసిన ఆయన రూమ్ మేట్స్.. నువ్వు మరీ అంత బక్కగా ఉంటే సినిమాల్లో రాణించడం కష్టం అని చెప్పేవారట. మంచి ఫిజిక్ ఉంటేనే అవకాశాలు వస్తాయని హితోపదేశం కూడా చేశారట. అంతేకాదు బరువు పెరగాలంటే బీరు తాగాలని ఎక్కువగా ఆయన మైండ్ లోకి ఎక్కించేశారు. ఇక వెంటనే అప్పటి నుంచి బీర్ షాప్ కి వెళ్లి బీరు తాగడం అలవాటు చేసుకున్నారు రాజబాబు ..ఇక తర్వాత మద్యపానానికి కూడా ఆయన బానిస అయ్యారు. అదే ఆయన జీవితాన్ని అతలాకుతలం చేసింది.నాడు ఆయన మద్యానికి బానిస కాకపోయి ఉండి ఉంటే ఇంకొన్ని సంవత్సరాలు ప్రేక్షకులను అలరించే వారేమో.. అదే ఆయన జీవితాన్ని నాశనం చేసింది.

- Advertisement -

9 అడుగుల కాంస్య విగ్రహం..

ఇకపోతే రాజబాబు గొప్ప సంఘసంస్కర్త కూడా.. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును పేదలకు పంచిపెట్టేవారు. అందుకే ఆయన మరణాంతరం ఆయనను స్మరించుకుంటూ తన జన్మస్థలమైన రాజమండ్రిలో 2012లో రాజబాబు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనపై తమకున్న మమకారాన్ని చాటుకున్నారు. తన చిత్రాలతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన 45 సంవత్సరాల వయసులోనే అర్ధాంతరంగా మరణించడం అందరిని కలచి వేసిందని చెప్పవచ్చు. ఎంతటి వారిని అయినా ఈ మద్యం హతమారుస్తుందనడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు