Comedian Sudhakar: నా సినీ జీవితం నాశనం అవ్వడానికి అదే కారణం..?

Comedian Sudhakar.. ప్రముఖ సీనియర్ కమెడియన్ సుధాకర్ ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి, తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా చిరంజీవితో పాటే సినీ పరిశ్రమలోకి వచ్చిన సుధాకర్ 1980 నుంచి తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమాలు చేశారు. ముఖ్యంగా తమిళ్ సినీ ఇండస్ట్రీలో ఎమ్.జీ.ఆర్, జెమినీ గణేషన్ లాంటి అగ్ర హీరోలతో పోటీపడి మరీ సినిమాలు చేసేవారు. అయితే ఎదగడం ఓర్వలేక అక్కడ కొంతమంది ఈయనకు అవకాశాలు లేకుండా చేశారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి.

Comedian Sudhakar: That's the reason why my film career is ruined..?
Comedian Sudhakar: That’s the reason why my film career is ruined..?

గుర్తుపట్టలేదంటగా మారిపోయిన కమెడియన్ సుధాకర్..

నిజానికి సుధాకర్, చిరంజీవి ఇద్దరూ కెరియర్ మొదట్లో ఒకే రూమ్మేట్స్ అవడంతో ఇద్దరు ఇప్పటికే మంచి స్నేహితులుగానే ఉన్నారు. సుధాకర్ నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలను నిర్మించడం జరిగింది. సుధాకర్ అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. గతంలో లాగా కాకుండా అనారోగ్యంతో బలహీన పడడంతో సుధాకర్ ఫోటోలు, వీడియోలు కూడా అప్పుడు బాగా వైరల్ అయ్యాయి. దాంతో ఆయన ఆరోగ్యం కుదుటపడాలని మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకున్నారు.

ఆ సినిమా తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది..

ఇటీవల ఆయన కొడుకు బెన్నీ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే బెన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంటర్వ్యూలలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా సుధాకర్, ఆయన కొడుకు బెన్నీ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో సుధాకర్ ఎందుకు సినిమాలు ఆపేశాడు అన్న విషయాన్ని కూడా వెల్లడించారు. సుధాకర్ మాట్లాడుతూ.. వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతి సినిమా తెలుగులో నా చివరి సినిమా.. ఆ సినిమా తర్వాత నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దానివల్ల నేను సినిమాలకి కూడా దూరమయ్యాను. ప్రస్తుతం నేను రిటైర్ అయిపోయాను. అందుకే సినిమాలు చేయలేదు. కానీ నేను లేని లోటును నా కొడుకు భర్తీ చేయాలని అనుకుంటున్నాను అంటూ తెలిపారు.

- Advertisement -

తండ్రి ఎంట్రీ పై కొడుకు కామెంట్స్..

అయితే సుధాకర్ కొడుకు బెన్నీ మాత్రం నాన్న ఏజ్ కి తగ్గట్టుగా ఏదైనా పాత్రలు వస్తే చేయిస్తాను. అయితే మరి ఆయన నటిస్తారో లేదో తెలియదు అంటూ తెలిపారు సుధాకర్. సంక్రాంతి సినిమాలో చివరిగా నటించిన ఆయన..చివరిగా నటించిన మరికొన్ని సినిమాలు కూడా ఆ సినిమా తర్వాత రిలీజ్ అయ్యాయి. ఏది ఏమైనా సంక్రాంతి సినిమా తర్వాతనే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ సినిమా తర్వాతే నా సినీ జీవితం కూడా నాశనం అయ్యింది అంటూ చెప్పుకొచ్చారు సుధాకర్. ప్రస్తుతం సుధాకర్ చేసిన ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే సుధాకర్ ఒకప్పుడు హీరోగా కనిపించి , మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు గతంలో ఆయన హీరోయిన్ రాధికతో ఎఫైర్ పెట్టుకున్నాడు అనే వార్తలు కూడా వినిపించాయి. ఏది ఏమైనా కమెడియన్ సుధాకర్ కి ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు