Adah Sharma : కాంట్రవర్సీ

అదా శర్మ.. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. తర్వాత టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు దక్కించుకున్న ఈ గ్లామర్ బ్యూటీ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. అయితే ప్రస్తుతం అదా శర్మ కు ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ఈమె ఇటీవల ‘ది కేరళ స్టోరీ’ అంటూ ఒక సినిమా చేసింది. దీనికి సంబంధించిన ఒక టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ టీజర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ వివాదాలను మాత్రం సృష్టిస్తోంది.

ఈ చిత్రం కేరళ రాష్ట్రాన్ని కించపరిచేలా ఉందని కొంత మంది ఆరోపిస్తున్నారు. దీనిపై కేరళ సీఎం విజయన్ కి, ఆ రాష్ట్ర డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. కేరళ రాష్ట్రంలో ఉగ్రవాదులు సేఫ్ గా ఉంటున్నారు అన్నట్టు ఈ చిత్రంతో చూపిస్తున్నారని వారు ఫిర్యాదులో తెలిపారు. ఇది టీజర్ లో ఉండే ఒక డైలాగ్ తో తెలుస్తుందని వారు చెబుతున్నారు. ఇంతకీ ఈ టీజర్ లో వచ్చిన డైలాగ్ ఎంటంటే..?

“నా పేరు షాలిని ఉన్నికృష్ణన్. నర్సుగా ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను ఫాతిమా బా అనే ఐసిస్ ఉగ్రవాదిని. నేను ఆఫ్ఘనిస్థాన్‌లోని జైల్లో ఉన్నాను. అనే డైలాగ్‌తో ఈ చిత్రం టీజర్‌ ప్రారంభమవుతుంది. “నేను ఒంటరిని కాదు. నాలాంటి 32 వేల మంది అమ్మాయిలు మతం మారి సిరియా, యెమెన్ ఎడారుల్లో చనిపోయారు. ఓ సాధారణ అమ్మాయి ప్రమాదకరమైన ఉగ్రవాదిగా మారే భయంకరమైన గేమ్ కేరళలో చోటుచేసుకుంది. అది కూడా బహిరంగంగానే. దీన్ని ఎవరూ ఆపలేదా? ఇది నా కథ. ఆ 32 వేల మంది అమ్మాయిల కథ ఇది. ఇది కేరళ కథ” అంటూ టీజర్ లో అదా శర్మ చెబుతుంది. ఈ డైలాగ్ కేరళలలో ఉగ్రవాదులు సురక్షితంగా ఉంటున్నారు అని చెప్పేలా ఉందని ఫిర్యాదు దారుల వాదన. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు