Cooli: రజనీకాంత్ కూలి సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో కామియో రోల్

Cooli: సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంటుంది. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో కూడా అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరో రజినీకాంత్. అయితే వరుసగా డిజాస్టర్లు పడుతూ సతమతమవుతున్న తరుణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాదాపు 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రజనీకాంత్ స్ట్రాగ్ ఆటిట్యూడ్ స్టైల్ ని అద్భుతంగా వాడి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు నెల్సన్.

ఈ సినిమాతో నెల్సన్ కూడా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. కొలమవు కోకిల సినిమాతో దర్శకుడుగా పరిచయమైన నెల్సన్ ఆ తర్వాత వరుణ్ డాక్టర్ సినిమాతో మంచి పేరు సాధించి 100 కోట్ల మార్కెట్లోకి చేరిపోయాడు. ఆ తర్వాత ఏకంగా తలపతి విజయ్ సినిమా చేసే అవకాశాన్ని పొందుకున్నాడు. దళపతి విజయ్ హీరోగా చేసిన బీస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో చాలామంది నెల్సన్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జైలర్ సినిమాతో అందరికీ సమాధానం ఇచ్చాడు నెల్సన్.

Cooli: Bollywood star hero cameo role in Rajinikanth Cooli movie

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కూలీ అనే ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా పైన అందరికీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడు లోకేష్. ఇంతకుముందు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా కూడా అదే రేంజ్ వీడియోని రిలీజ్ చేశాడు. ఇకపోతే కూలి షూటింగ్ రీసెంట్ గానే హైదరాబాదులో మొదలైంది. ఈ సినిమాలో శృతిహాసన్ కీలకపాత్రలో కనిపిస్తుంది. అలానే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు